ర్యాగింగ్ భూతానికి విద్యార్థులు బలి అవుతున్న సంఘటనలు చాలా చూస్తునే ఉన్నాం. ఇది చాలా దురదృష్టకరం. సీనియర్ విద్యార్థులు తమ అధికారాన్ని చూపించుకోవడానికి కొత్తగా కాలేజీలో చేరిన విద్యార్థులను మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురి చేస్తుంటారు.
ర్యాగింగ్(Raging) భూతానికి విద్యార్థులు బలి అవుతున్న సంఘటనలు చాలా చూస్తునే ఉన్నాం. ఇది చాలా దురదృష్టకరం. సీనియర్ విద్యార్థులు తమ అధికారాన్ని చూపించుకోవడానికి కొత్తగా కాలేజీలో చేరిన విద్యార్థులను మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురి చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో ఇది ఆత్మహత్య(Suicide) లకు కూడా దారి తీస్తోంది.కాలేజీ యాజమాన్యం ర్యాగింగ్‌ను అరికట్టడానికి కఠిన నిబంధనలను అమలు చేస్తున్న ర్యాగింగ్ కు బలవుతున్న విద్యార్థుల గురించి తరుచుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా ర్యాగింగ్ భూతానికి మరో విద్యార్ధి బలయ్యాడు.
సీనియర్ల వేధింపుల తట్టుకోలేక
హైదరాబాద్(Hyderabad) మేడ్చల్‌లో దారుణం జరిగింది. సీనియర్ల వేధింపులు తట్టుకోలేక బీటెక్ విద్యార్థి(BTech Student) బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ కు చెందిన సాయితేజ సిద్దార్థ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ సెకండ్ ఇయర్ చసువుతున్నాడు. సీనియర్ల టార్చర్ తట్టుకోలేక హాస్టల్‌లో ఉరేసుకుని జాదవ్ సాయితేజ చనిపోయాడు. సీనియర్లు బలవంతంగా మద్యం తాగించారంటూ సెల్పీ వీడియోలో తెలిపాడు. బార్‌కు తీసుకెళ్లి ఫుల్‌గా తాగి…రూ. 10వేల బిల్లు కట్టాలని ఒత్తిడి చేశారంటూ సాయితేజ చివరి వీడియోలో తెలిపాడు
సీనియర్ల టార్చర్‌తోనే సాయితేజ చనిపోయాడని స్నేహితుల ఆరోపిస్తున్నారు. సాయితేజ మృతితో అతని కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. తమ కుమారుడి మరణానికి కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యమేనని అతని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.
Also read
- Andhra News: బియ్యం కావాలని షాప్‌కు వచ్చాడు.. రూ.10వేలు UPI చేసి వెళ్లిపోయాడు.. సీన్‌కట్ చేస్తే..
- సినిమా డైరెక్టర్లనే మించిపోయారు.. ఆ ప్లానింగ్స్ ఏంటి భయ్యా! భర్త మర్డర్‌కు ప్రియుడితో స్కెచ్.. సిన్ సీన్‌కు ట్విస్టే
- అమ్మాయి పిలిచిందని వెళ్లాడు.. తిరిగి శవమై వచ్చాడు! మిస్టరీగా సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి
- అటు ఆమెతో.. ఇటు ఇమెతో.. కట్ చేస్తే, పల్పీ ఆరంజ్ ఇచ్చి కారులో తీసుకెళ్లారు.. భువనేశ్వర్, కృపారాణి మామూలోళ్లు కాదు..
- శ్మశానం దగ్గర అనుమానాస్పదంగా ముగ్గురు.. పోలీసలు వచ్చి చూడగా.. ఊహించని





