November 22, 2024
SGSTV NEWS
CrimeTelangana

అసలీ నోట్లను మించిన నకిలీ నోట్లు.. ఫేక్ కరెన్సీ గుట్టురట్టు..

వికారాబాద్‌లో ఫేక్‌ కరెన్సీ ముఠా గుట్టురట్టయింది. తాండూరులో 7లక్షల 95వేల నకిలీ నోట్లు సీజ్‌ చేశారు పోలీసులు. నకిలీ నోట్లను చలామణి చేస్తున్న నిందితులను అరెస్ట్ చేశారు తాండూర్ పోలీసులు. ముందుగా దొంగనోట్లను ముద్రిస్తున్న చంద్రయ్యను అరెస్టు చేసిన పోలీసులు.. అతని వద్దనుండి తొంబై 500 నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా.. చంద్రయ్య ఇచ్చిన సమాచారం మేరకు జగదీష్ వీర వెంకటరమణ, శివకుమార్లను అరెస్ట్ చేశారు. ఈ కుంభకోణంలో ప్రమేయమున్న నిందితులపై US 178,179,180 and 318(4) of BNS పైన కేసు నమోదు చేశారు. మల్లంపేట బాచుపల్లి, జగదీష్ నివాసంలో 7,50,000 నకిలీ 500 రూపాయల నోట్ల స్వాధీనం చేసుకున్నారు. ఈ నకిలీ నోట్లతోపాటు నోట్ల తయారీకి ఉపయోగించిన కంప్యూటర్ మానిటర్, CPU, ప్రింటర్, 5 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

Also read :కోట్లు వస్తాయని ఆశపడి కంగుతిన్న ఇన్సురెన్స్ ఏజెంట్.. ఏం జరిగిందంటే..

గతంలో బ్యాంక్ ఆఫ్ బరోడాలో మేనేజర్‎గా పనిచేసిన జగదీష్.. బ్యాంక్ నిధులను దుర్వినియోగం చేసి అరెస్ట్ అయ్యారు. నెల రోజులు సంగారెడ్డి జిల్లా జైలులో శిక్ష అనుభవించాడు. బెయిల్‎పై బయటకు వచ్చి వీర వెంకటరమణతో కలిసి నకిలీ నోట్లు చలామణి చేస్తున్నాడు. వీరిపై గతంలో కోనసీమ జిల్లాలో కూడా కేసు నమోదు అయినట్లు చెబుతున్నారు పోలీసులు. వీర వెంకటరమణకు సంగారెడ్డి జైలులో జగదీష్ పరిచయమైనట్లు విచారణలో తెలిసింది. జైలు నుండి బెయిలుపై విడుదలయ్యాక నకిలీ నోట్లు తయారు చేసి చలామణి చేస్తున్నట్లు గుర్తించారు. ఇందులో ప్రమేయం ఉన్న వీర వెంకటరమణ, జగదీష్, శివకుమార్ లపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలిస్తు్న్నట్లు తెలిపారు పోలీసులు. నకిలీ నోట్లను చలామణి చేస్తే చట్టరీత్యా కటినమైన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Also read :దుష్ప్రచారం తట్టుకోలేక యువజంట ఆత్మహత్య.! కానీ అనుకోకుండా అనుకోని స్థితిలో..

Related posts

Share via