November 20, 2024
SGSTV NEWS
CrimeTelangana

ఇదెక్కడి విచిత్రం రా స్వామీ..! ఏడేళ్ల క్రితం చనిపోయిన వ్యక్తి పై కేసు నమోదు చేసిన పోలీసులు!



భూవివాదంలో తమ ప్రత్యర్థికి పోలీసులు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనేందుకు ఈ సంఘటన నిదర్శనం అంటున్నారు కుటుంబసభ్యులు.


ఓ ఎఫ్ఐఆర్ విషయంలో పోలీసులు అత్యుత్సాహం చూపించారు.. ఏకంగా మరణించిన వ్యక్తిపైనే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ విషయం తెలుసుకుని కుటుంబసభ్యులతో పాటు గ్రామస్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. బతికి ఉన్న వారిపై కేసు నమోదు చేయకుండా చనిపోయినవారి పై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఏడేళ్ల క్రితం చనిపోయిన వ్యక్తి పై కేసు నమోదు చేసిన వింత సంఘటన మెదక్ జిల్లా నర్సాపూర్‌లో జరిగింది. ఓ భూ వివాదంలో మరణించిన వ్యక్తి పేరు ఎఫ్ఐఆర్‌లో చేర్చారు నర్సాపూర్ పోలీసులు. ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.


నర్సాపూర్ మండలం నారాయణపూర్ శివారులోని లచ్చిరాం తండాలోని 200 సర్వే నంబర్‌లో కొన్ని సంవత్సరాలుగా భూమివాదం కొనసాగుతుంది. భూ వివాదంలో ఐదుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు నర్సాపూర్ పోలీసులు. కేసు నమోదైన వారిలో పాతులోత్ విఠల్ పెరు ఏ4 గా చేర్చారు. విఠల్ పేరు ఎఫ్ఐఆర్‌లో ఉండటం చూసి ఆయన కుటుంబీకులు ఒక్కసారిగా ఆశ్చర్య పోయారు. అందుకు కారణం విఠల్ ఏడు సంవత్సరాల క్రితమే చనిపోయాడు. పోలీసులు కనీసం విచారణ చేయకుండనే ఏడేళ్ల క్రితం చనిపోయిన వ్యక్తిపై కేసు పెట్టడం ఏంటని విఠల్ కుటుంబీకులు మండిపడుతున్నారు.

భూవివాదంలో తమ ప్రత్యర్థికి పోలీసులు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనేందుకు ఈ సంఘటన నిదర్శనం అంటున్నారు కుటుంబసభ్యులు. మృతుడి ఫోటో, డెత్ సర్టిఫికేట్‌ను చూపిస్తూ తమను పోలీసులు భూవివాదంలో భయాందోళనకు గురి చేస్తున్నారని వాపోయారు. కేసు పూర్తి దర్యాప్తు చేపట్టకుండానే ప్రత్యర్ధులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ లబోదిబోమంటున్నారు విఠల్ కుటుంబీకులు, లచ్చిరాం తండావాసులు

Also read

Related posts

Share via