కరీంనగర్ జిల్లాలో పోలీసులు అత్యుత్సాహంతో ఓ యువకుడుని చితకబాదారు. ఒక దొంగతనం విషయంలో నిర్దారణ కోసం పోలీసులు వ్యవహరించిన తీరు జై భీం సినిమాను తలపించేలా ఉంది. కాయకష్టం చేసుకొని జీవించే ఓ ఎస్టీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తిపై దొంగతనం ఒప్పుకోవాలంటూ ధర్డ్ డిగ్రీ ప్రయోగించారు. ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇదే సంచలనంగా మారింది. ప్రజాసంఘాల నేతలు బాధితుడికి అండగా నిలిచారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామానికి చెందిన తాడి కనుకయ్య అనే వ్యక్తిని దొంగతనం కేసులో అప్రూవర్‌గా మారాలంటూ పోలీసుస్టేషన్‌కి పిలిపించి చిత్రహింసలకి గురి చేశారు.
Also read :ఒక్క మాటకే ఇంత దారుణమా..! క్లాస్‌రూంలో ప్రిన్సిపల్‌ను కత్తితో పొడిచి చంపిన విద్యార్థి
ఎరుకలి సామాజికవర్గానికి చెందిన తాముకూలీపనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తామని చెప్పాడు బాధితుడు. తమపై చేయని నేరానికి.. పోలీసు స్టేషనుకు పిలిపించి చిత్రహింసలకు గురి చేశారని బాధితుడు కనుకయ్య అవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రస్తుతం కరీంనగర్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కనుకయ్యని ప్రజా సంఘాల నాయకులు కలిసి పరామర్శించారు. సమగ్ర విచారణ చేయాల్సిన పోలీసులు విచారణ పేరుతో థర్డ్ డిగ్రీ ఎలా ప్రయోగిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేనా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ రామడుగు పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు
Also read :బెజవాడలో బెంబేలెత్తిస్తున్న ముఠా.. లక్షలు ఆశచూపి కిడ్నీ కొట్టేశారు..!