హైదరాబాద్ సిటీలో మదకద్రవ్యాల దందా విచ్చలవిడిగా కొనసాగుతోంది. పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. కీలక వ్యక్తులను అరెస్టులు చేస్తున్నా.. గంజాయి, డ్రగ్స్ దందాకు చెక్ పడటం లేదు. నిన్న హైదరాబాద్ లోని వేర్వేరు ఘటనల్లో ఆరుగురు అరెస్ట్ అయ్యారంటే సప్లయ్ తీవ్రత ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. కిలోల కొద్ది గంజాతోపాటు డ్రగ్స్ ప్యాకెట్లు దొరికాయి.
తాజాగా శుక్రవారం SOT మేడ్చల్ టీమ్ & మేడ్చల్ పోలీస్ సంయుక్తంగా మేడ్చల్ PS పరిధిలోని రేకులబావి చౌరస్తా వద్ద అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరు యువకులను పట్టుకుని బాగులను పరిశీలించారు. వారి వద్ద నుండి 2 కిలోల గంజాయి, ప్లాస్టిక్ కవర్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఒరిస్సాలో నౌపాడా ప్రాంతం నుంచి 2 కేజీల గంజాయిని తీసుకొని హైదరాబాద్ కు వచ్చారు. పోలీసులు గస్తీ నిర్వహించగా దొరికిపోయారు. అంతేకాదు.. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి కేజీకి రూ.2,500/- చొప్పున కొనుగోలు చేసినట్లు విచారణలో తెలిసింది.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025