ఇప్పుడు యువత రీల్స్ వెర్రి ఏ స్థా్యికి వెళ్లిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఫాలోవర్స్‌ను పెంచుకునేందుకు ఎన్నో పిచ్చి వేషాలు వేస్తున్నారు. లేనిపోని ప్రమాదాలు కోరి తెచ్చుకుంటున్నారు. పబ్లిక్ ప్లేసుల్లో కూడా న్యూసెన్స్ చేస్తున్నారు. ఈ మధ్య మెట్రో రైళ్లలో కూడా పలువురు రీల్స్ చేస్తున్న వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే హైదరాబాద్‌లో ఓ యువకుడు ఎయిర్ గన్‌తో రీల్స్ చేయడం చర్చనీయాంశమైంది. రోడ్లపై వెళ్లేవారిని భయబ్రాంతులకు గురిచేస్తూ.. అతను రోడ్డుపై ఎయిర్ గన్‌లో రీల్స్ చేశాడు. తమ దృష్టికి రావడంతో బంజారాహిల్స్ పోలీసులు సదరు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.
సనత్‌నగర్ ప్రాంతానికి చెందిన 21 ఏళ్ల మొహద్ అఫీజుద్దీన్ వీడియో గ్రాఫర్. అతను ఇటీవల బంజారాహిల్స్ రోడ్ నెం.1లో ఎయిర్ రైఫిల్‌తో హల్ చల్ చేశాడు. ఓపెన్ టాప్ జీపులో ఫోజు కొడుతూ.. డాష్‌బోర్డుపై ఎయిర్ రైఫిల్‌ను పెట్టి ఫోజు కొట్టాడు. అంతేకాదు తన వ్యవహారాన్ని వీడియోలు తీసి ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియోలు వైరల్ కావడంతో.. బంజారాహిల్స్ పోలీసులు రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసి అతన్ని వెతికి మరీ అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్ రైఫిల్‌తో పాటు జీపును సీజ్ చేశారు. నిందితుడు చేసిన పని నేరమని పోలీసులు తెలిపారు. యువత ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. రీల్స్ మోజులో పడి యువత బంగారం లాంటి భవిష్యత్ నాశనం చేసుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.
Also read
- సీతాదేవి తనువు చాలిస్తూ భూమిలో ఐక్యం అయిన ప్రదేశం ఎక్కడుందో తెలుసా..
- దైవ దర్శనకోసం వెళ్తే దారుణం.. ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే.. సంచలన విషయాలు..
- శ్రీ రామ నవమి పండగ విషయంలో గందరగోళం.. ఏప్రిల్ 5 లేదా 6 ఎప్పుడంటే
- మహిళల రుతు సమయం గురించి గరుడ పురాణం ఏం చెబుతుందో తెలుసా..?
- AP Crime: ఏపీలో దారుణం.. యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన యువతి!