నిర్మల్ జిల్లా హైవేపై ఇద్దరు వ్యక్తులు బైక్‌పై అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు వారిని ఆపి, తనిఖీ చేశారు. వారి వద్ద ఏం లేదుగానీ.. వీరు బైక్‌పై తీసుకెళ్తున్న గోనె సంచి మూటపై అధికారుల చూపు పడింది. వెంటనే దాన్ని ఓపెన్ చేసి చూడగా అసలు కథ బయటపడింది. ఇంతకీ గోనె సంచిలో ఏముందంటే..
నిర్మల్, డిసెంబర్ 18: హైవేపే ఇద్దరు వ్యక్తులు బైక్‌పై యమ స్పీడ్‌లో వెళ్తున్నారు. అనుమానం వచ్చిన పోలీసులు వారి బైక్‌ను ఆపుజేపి.. ఇద్దరినీ తనిఖీ చేశారు. అతనంతరం వారు బైక్‌పై తీసుకెళ్తున్న ఓ మూటను కూడా విప్పి చూశారు. అయితే లోపల మూడు అడవి జంతువుల కళేభారాలు ఉండటం చూసి షాకయ్యారు. అవి అరుదైన ముళ్ల పందులు. మూడింటినీ వేటాడి, వాటిని ఇలా బైక్‌పై తరలిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డారు. నిర్మల్ జిల్లా నిర్మల్ మండలం కొండాపూర్ గ్రామం వద్ద నేషనల్ హైవే 44 బైపాస్‌పై ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.
దీంతో వెంటనే ఆ ఇద్దరిని ఫారెస్ట్ అధికారులు అదుపులోకి తీసుకొని విచారించణ చేపట్టారు. చనిపోయిన మూడు ముళ్లపందుల కళేబరాలతో పాటు నిందితులిద్దర్నీ అటవీశాఖ కార్యాలయానికి తరలించారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ శాఖ అధికారి మాట్లాడుతూ.. దిల్వార్ పూర్ మండలం లోలం గ్రామ శివారు అటవీ ప్రాంతంలో ఉచ్చులు బిగించగా ఆ ఉచ్చులలో ఈ మూడు ముళ్లపందులు చిక్కుకున్నాయని నిందితులు తెలిపారు. చిక్కుకున్న మూడ్ల పందులను కర్రలతో కొట్టి కిరాతకంగా హతమార్చే. వాటిని విక్రయించేందుకు నిర్మల్‌కు తీసుకొని వెళ్తున్నట్లు తెలిపారు. దీంతో అటవీ అధికారులు ఇద్దరు నిందితులపై వైల్డ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి, నిందితులను మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పర్చనున్నట్లు తెలిపారు
Also Read
- Aghori: మహిళా నిర్మాతకు యో*ని పూజ.. రూ.10 లక్షలు దొబ్బేసిన అఘోరీ!
- మీ కలలో ఇవి కనిపిస్తే లక్ష్మీ దేవి మీ ఇంటికి వచ్చినట్లే..! ఇక డబ్బే.. డబ్బు..!
- Garuda Puranam: మీ జీవితాన్ని మార్చేసే పది సూత్రాలు..! మీ కష్టాలన్నీ దూరం అవుతాయి..!
- Shani Planet: ఈయన భక్తులను ఏలినాటి శని కూడా టచ్ చేయలేదు.. జాతకం ఎలా ఉన్నా వీరికి మాత్రం రాజభోగాలే
- Best Friend Rasi: రాశిచక్రం ఆధారంగా మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసుకోండి