అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ముగ్గురు చిన్నారులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన కేసును పోలీసులు చేధించారు. కన్న తల్లి రజిత కర్కషంగా ఆలోచించి ముగ్గురు పిల్లలకు పెరుగన్నంలో విషం పెట్టి చంపిందని తేల్చారు. భర్తను కూడా అంతమొందిచాలని భావించగా.. ఆరోజు అతడు పెరుగున్నం తినకపోటవంతో బతికి బట్టకట్టాడని పోలీసులు వెల్లడించారు.
అమీన్‌పూర్ పిల్లల మృతి కేసును పోలీసులు చేధించారు. ముగ్గురు పిల్లల మృతి కేసులో తల్లే విలన్ అని గుర్తించారు. విషం పెట్టి కడుపున పుట్టిన ముగ్గురు పిల్లలను తల్లే పాశవికంగా అంతమొందించినట్లు తేల్చారు. వివాహేతర సంబంధం మోజులో ముగ్గురు పిల్లలను హత్య చేసిందని నిర్ధారించారు. గత నెల 27న పిల్లలకు పెరుగన్నంలో విషం పెట్టిందని.. తాను కూడా భోజనం చేసి అస్వస్థతకు గురైనట్టు నాటకం ఆడిందని పోలీసులు తేల్చారు. విచారణలో నిజం బయటపడటంతో తల్లి రజితను అరెస్ట్ చేశారు. భర్తను కూడా చంపాలని ఆమె డిసైడయ్యింది. అయితే అతను పెరుగన్నం తినకపోవడంతో ప్రాణాపాయం తప్పింది.
హైదరాబాద్ శివారు అమీన్‌పూర్‌లో జరిగిన ఈ ఘటన చాలా సంచలనం సృష్టించింది. ముందుగా భర్తను అనుమానించారు పోలీసులు. లోతైన దర్యాప్తు తర్వాత భార్య రజిత బాగోతం బయటపడింది. కొన్నాళ్ల క్రితం రజిత టెన్త్ క్లాస్‌మేట్స్ గెట్ టుగెదర్‌కు వెళ్లింది. అక్కడ ఓ స్నేహితుడితో పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ సంబంధానికి పిల్లలు అడ్డొస్తున్నారనే కారణంతో వాళ్లను చంపాలని ప్లాన్ చేసింది. ఫిబ్రవరి 27 శుక్రవారం రాత్రి పిల్లలకు పెరుగన్నంలో విషం పెట్టి తినిపించింది. భర్త చెన్నయ్య ఆరోజు పెరుగు తినకుండా భోజనం ముగించాడు. తర్వాత వాటర్ ట్యాంకర్ డ్రైవింగ్ పనిపై బయటకు వెళ్లిపోయాడు. తిరిగొచ్చాక చూస్తే పిల్లలు విగతజీవులుగా పడి ఉన్నారు. ముగ్గురు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. 12 ఏళ్ల సాయికృష్ణ, 10 ఏళ్ల మధు ప్రియ, 8 ఏళ్ల గౌతమ్ మృతితో తీవ్ర విషాదం నెలకొంది.
ఎందుకిలా జరిగిందో తనకు తెలియదని, తాను కూడా తీవ్ర అస్వస్థతకు గురయ్యానని రజిత చెప్పడంతో ఆమెను ఆస్పత్రిలో చేర్పించాడు భర్త. చివరికి విచారణలో ప్రియుడితో కలిసి రజిత చేసిన ఘోరం బయటపడింది. రజితతోపాటు ఆమె ప్రియుడూ ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్నారు. వివాహేతర సంబంధం మోజులో పడి కడుపున పుట్టిన బిడ్డలను చంపుకోవటంపై స్థానికులు మండిపడుతున్నారు. ఆమెకు కఠిన శిక్ష వేయాలని కోరుతున్నారు
Also read
- నేటి జాతకములు..4 ఏప్రిల్, 2025
- శ్రీ కృష్ణుడు మనవడు వజ్రనాభుడు నిర్మించిన ఆలయం ద్వారకాధీష ఆలయం.. ప్రాముఖ్యత ఏమిటంటే
- Dreams Theory: ముద్దు పెట్టుకుంటున్నట్లు కల కంటున్నారా.. ఆ కలకు అర్ధం తెలిస్తే ఆశ్చర్యపోతారు.
- కామదా ఏకాదశి: స్త్రీలకు సౌభాగ్యాన్ని ఇచ్చే కామద ఏకాదశి ఎప్పుడు? పూజా శుభ సమయం? నియమాలు
- Horoscope April 2025: ఏప్రిల్లో ఐదు గ్రహాల సంచారం.. ఈ మూడు రాశుల వారు పట్టిందల్లా బంగారమే..