June 29, 2024
SGSTV NEWS
TelanganaViral

Watch Video: తన భార్య కోసం బస్ అపలేదని. ఏకంగా కండెక్టర్‎ను ఏం చేశాడంటే..




ఆర్టీసీ బస్సు ఆపలేదని ఏకంగా ఓ జంట కండక్టర్‎తో గొడవకు దిగారు. ఇలాంటి చోద్యం ఎక్కడా చూడలేదంటూ స్థానికులు, విషయం తెలిసిన వారు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇది జరిగింది మరెక్కడో కాదు. హైదరాబాద్ నగరంలోనే.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రజా సంక్షేమం నిమిత్తం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కలిపించడంతో ఇలాంటి సంఘటనలు చాలానే చూస్తున్నాం.

ఆర్టీసీ బస్సు ఆపలేదని ఏకంగా ఓ జంట కండక్టర్‎తో గొడవకు దిగారు. ఇలాంటి చోద్యం ఎక్కడా చూడలేదంటూ స్థానికులు, విషయం తెలిసిన వారు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇది జరిగింది మరెక్కడో కాదు. హైదరాబాద్ నగరంలోనే.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రజా సంక్షేమం నిమిత్తం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కలిపించడంతో ఇలాంటి సంఘటనలు చాలానే చూస్తున్నాం. ఆ మధ్య కొందరు మహిళలు ప్రయాణం ఉచితం కదా అని మగవాళ్లకు కూడా సీట్లు ఇవ్వకుండా మొత్తం వాళ్లే ఆక్రమించుకున్న సంఘటనలు చూశాం. ఆపై బస్సులో సీట్ల కోసం జుట్టు జుట్టు పట్టుకుని పొట్టు పొట్టున కొట్టుకున్న సంఘటనలు కూడా చాలానే ఉన్నాయి. అయితే ఇప్పుడు మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. బస్సు ఆపలేదని వెంబడించి మరీ కండక్టర్‎తో గొడవకు దిగిన ఘటన చంద్రయాణాగుట్ట చౌరస్తాలో చోటు చేసుకుంది. ఇలాంటి చిల్లర చేష్టలతో ఆర్టీసీ సిబందికి చుక్కలు చూపిస్తున్నారు ప్రజలు.

హైదరాబాద్ ఎల్‎బీ నగర్ బస్ స్టాప్‎లో బస్సు కోసం ఓ మహిళ ఎదురుచూస్తోంది. ఇంతలో ఓ బస్సు వచ్చిందని, కానీ ఆ స్టాప్‎లో ఆపకుండా వెళ్లిపోయారని సదరు మహిళ ఆరోపిస్తుంది. దీంతో బస్సును వెంబడించి మరీ కండక్టర్‎పై దాడికి ప్రయత్నించారు. నడిరోడ్డుపై బస్సుకు అడ్డంగా నిలబడి వెళ్లనివ్వకుండా నానా హంగామా చేశారు. ఇలా ఎలా ఆపకుండా వెళ్తారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీనిపై ఆ బస్సు కండక్టర్ కూడా మాట్లాడుతూ.. రోడ్డుపై ట్రాఫిక్ ఎక్కువగా ఉండడం వల్లే ఇలా జరిగిందని అన్నాడు. ఇంతలో ప్రయాణికులు బస్సును ఆపలేదంటూ తమపై దాడికి దిగారని వాపోయాడు. దీంతో స్థానికంగా విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసులు కలగజేసుకుని గొడవ సద్దుమణిగేలా చేశారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి బస్సు కండక్టర్, ప్రయాణికులు ఒకరిపై ఒకరు చంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. ఇదిలా ఉండగా.. వాస్తవానికి హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల బస్ స్టాప్‎లల్లో సిటీ బస్సులు ఆపడం లేదని పలువురు ప్రయాణికులు ఆర్టీసీ వ్యవస్థపై  మండిపడుతున్నారు.

Also read

Related posts

Share via