బోధన్ పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. ఆడుకుంటూ వెళ్లి పార్కింగ్‌లో పెట్టిన కారులోకి ఎక్కిన చిన్నారి డోర్ లాక్ కావటంతో ప్రాణాలు కోల్పోయాడు. పార్కింగ్ చేసిన కార్లవైపు పిల్లలు వెల్లకుండా చూసుకోవాలి. పిల్లలు తెలియక ప్రమాదంలో పడే ఛాన్స్ ఉన్నందున వారిని గమినిస్తూ ఉండాలి
కారులో ఊపిరి ఆడక ఆ చిన్నోడు ఎంత నరకం అనుభవించాడో.. అమ్మానాన్నల కోసం ఎంత గుక్కెట్టి ఏడ్చాడో.. చివరికి విగతజీవిగా మారిపోయాడు. ఊపిరాడక కారులో ఆరేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో వెలుగుచూసింది. ఆడుకుంటూ వెళ్లి పార్కింగ్‌లో పెట్టిన కారులోకి ఎక్కాడు. అనుకోకుండా డోర్ లాక్ అవ్వడంతో.. ఊపిరి అందక ఉక్కిరి బిక్కిరి అయి కన్నుమూశాడు. బోధన్‌లోని గోసం బస్తీకి చెందిన రేణుక ఈనెల 5న రాకసిపేటలోని ఆంజనేయుడి గుడి ప్రాంగణంలో కూలి పనులకు వెళ్లింది. తనతో పాటు ఆరేళ్ల కొడుకును కూడా తీసుకెళ్లింది. ఈ క్రమంలో తల్లి పని చేస్తూ ఉండగా.. కుమారుడు రాఘవ ఆ పక్కనే ఆడుకునేందుకు వెళ్లి.. ఆ తర్వాత కనిపించకుండా పోయాడు. దీంతో బాలుడి పేరెంట్స్ పోలీసులను ఆశ్రయించారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు.. బాలుడి కోసం సెర్చ్ ఆపరేషన్ మొదలెట్టారు.
అయితే రెండు రోజులుగా కనిపించకుండా పోయిన బాలుడు అదే ప్రాంతంలో పార్క్ చేసిన ఓ కారులో విగతజీవిగా కనిపించాడు. కారు డోర్లు ఓపెన్ ఉన్నప్పుడు బాలుడు అందులోకి వెళ్లగానే.. కారు ఒక్కసారిగా లాక్ అయింది. దీంతో ఆ చిన్నోడు కారులోనే ఊపిరాడక మృతి చెందాడు. గత రాత్రి కారు ఓనర్ బయటకు వెళ్లేందుకు కారు తీస్తుండగా.. కారులో పిల్లోడి బాడీని గుర్తించాడు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాడు. అక్కడకు చేరుకున్న పోలీసులు బాలుడి డెడ్‌బాడీ మిస్సైయిన రాఘవదిగా గుర్తించారు. వెంటనే పేరెంట్స్‌కు సమాచారం అందించారు. అనంతరం చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గవర్నమెంట్ ఆస్పత్రికి తరలించారు.
కారులో ఇలా పిల్లలు.. చిక్కుకుపోయిన చనిపోయిన ఘటనలు అప్పుడప్పుడు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పిల్లల విషయంలో పేరెంట్స్ జాగ్రత్తగా ఉండాలి. వారు ఆడుకునే సమయంలో ఓ కన్నేసి ఉంచాలి. తెలియక వారు ప్రమాదాల్లో పడే అవకాశం ఉంటుంది
Also read
- హనుమాన్ జయంతిని ఏడాదిలో రెండు సార్లు ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
- ఆర్ధిక ఇబ్బందులా, జీవితంలో సమస్యలా హనుమాన్ జయంతి రోజున ఇంట్లో ఇలా పూజ చేయండి..
- హనుమంతుడికి ఇష్టమైన ఈ నైవేద్యం పెడితే మీ కోరికలు నెరవేరుతాయి..!
- సతీసమేత హనుమంతుడు..! తెలంగాణలో ఈ ప్రత్యేక ఆలయం
- Nellore: నెల్లూరు జిల్లాలో భర్త, అత్తమామల పైశాచికం.. కోడలిని వివస్త్రను చేసి హత్య!