November 21, 2024
SGSTV NEWS
CrimeTelangana

అయ్యో రామా ఎంత కష్టమొచ్చే..10 టన్నుల చేపలు మృతి.. లబోదిబోమంటున్న

మత్స్యకారులు.. కారణం ఏంటంటే..!
చెరువు నీటి శాంపిల్స్ సేకరించి టెస్టులకు పంపించారు. చెరువు నిండా కుప్పలు, తెప్పలుగా చచ్చిపోయి తేలిన చేపల్ని చూసి మత్స్యకారులు లబోదిబోమంటున్నారు. చేపల మృతితో సుమారు కోటి రూపాయలకు పైగా నష్టం వాటిల్లినట్టు అధికారులు అంచనా వేశారు.

పటాన్ చెరు మండలం చిట్కుల్ గ్రామంలోని పెద్ద చెరువులో సుమారు 10 టన్నుల చేపలు మృతి చెందాయి. చేపల మృతికి రసాయన వ్యర్థ పదార్థాలే కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమీపంలోని పలు ఫ్యాక్టరీల నుండి వెలువడే రసాయన వ్యర్థ పదార్థాలు చెరువులో కలవడంతోనే చేపలు మృతి చెందినట్లు ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం మేరకు మత్స్యశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. చెరువు నీటి శాంపిల్స్ సేకరించి టెస్టులకు పంపించారు. చెరువు నిండా కుప్పలు, తెప్పలుగా చచ్చిపోయి తేలిన చేపల్ని చూసి మత్స్యకారులు లబోదిబోమంటున్నారు. చేపల మృతితో సుమారు కోటి రూపాయలకు పైగా నష్టం వాటిల్లినట్టు అధికారులు అంచనా వేశారు.

Also read :Andhra Pradesh: ఛీ.. ఛీ.. వీడిని ఏమనాలి.. అంతటి నీచానికి దిగజారాడు.. వాడికి తగిన శాస్తే జరిగింది..

2023లో గత నైరుతి రుతుపవనాల సమయంలో మత్స్యశాఖ సరస్సులో 1.5 లక్షల చేప పిల్లలను విడుదల చేసింది. మత్స్యకారుల ఫిర్యాదు మేరకు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు, మత్స్యశాఖ అధికారులు సరస్సును సందర్శించారు. ప్రాథమిక పరీక్ష తర్వాత, పిసిబి అధికారులు కరిగిన ఆక్సిజన్ స్థాయిలు సాధారణం కంటే తక్కువగా ఉన్నాయని, ఇది చేపల మరణానికి దారితీసిందని గుర్తించారు.. అయితే ల్యాబ్‌ రిపోర్టులు వచ్చిన తర్వాతే కచ్చితమైన కారణాన్ని వెల్లడిస్తామని అధికారులు తెలిపారు

Also read VJA Murder: తండ్రి ప్రాణాలు బలి తీసిన కుమార్తె ప్రేమ.. ప్రేమికుడి ఘాతుకం, నడిరోడ్డుపై దారుణ హత్య

Related posts

Share via