SGSTV NEWS
CrimeTelangana

Nalgonda: మందు ఎక్కువైతే మనుషులు ఎంత విపరీతంగా ప్రవర్తిస్తారో చెప్పడానికి ఇతనే ఉదాహారణ

 

సాధారణంగా పోలీసులు అంటే అందరికీ భయం ఉంటుంది. ముఖ్యంగా దొంగలు, నేరస్థులు, తాగుబోతులకు ఎక్కువగా ఉంటుంది. కానీ ఓ తాగుబోతు మాత్రం పోలీస్ స్టేషన్ లో అర్ధరాత్రి హల్ చల్ చేశాడు. పోలీసులకే చుక్కలు చూపించాడు. మందుబాబు భయానికి పోలీసులు పరుగులు పెట్టారు. ఇంతకీ ఏం చేశాడో తెలుసుకోవాలంటే ఏ స్టోరీ చదవాల్సిందే.

అది నల్లగొండ పట్టణం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రాంతం. అర్ధరాత్రి సమయం. పట్టణమంతా నిశ్శబ్దంగా ఉంది. పోలీసులు నైట్ పెట్రోలింగ్ చేస్తున్నారు. ఆ సమయంలో దేవరకొండ రోడ్‌లో ఫుల్‌గా మందు కొట్టిన రావిళ్ల నర్సింహా మోటార్ సైకిల్‌పై వెళ్తూ హల్ చల్ చేస్తున్నాడు. ఈ మందు బాబును చూసిన పోలీసులు డ్రంకన్ డ్రైవ్ టెస్ట్ చేశారు. మీటర్ పగిలిపోయేలా 155 mg/100ml ఆల్కహాల్ రీడింగ్ నమోదయింది. దీంతో ఆ తాగుబోతుపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేశారు పోలీసులు. తనపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు ఎలా బుక్ చేస్తారంటూ పోలీసులతో వాగ్వివాదానికి దిగాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

కొద్దిసేపటితర్వాత నర్సింహా తన ఒంటిపై పెట్రోల్ పోసుకొని పోలీస్ స్టేషన్‌లోకి ప్రవేశించాడు. పోలీస్ స్టేషన్ గేటు వద్ద ఉన్న హోంగార్డు ప్రవీణ్ ఎవరు నువ్వు అంటూ నరసింహా దగ్గరకు వచ్చే ప్రయత్నం చేశాడు. అప్పటికే తనతో పాటు తెచ్చుకున్న సిగార్ లైటర్‌తో తనకి తాను నిప్పు అంటించుకున్నాడు. ఒక్కసారిగా బాంబు పేలినట్లుగా మంటలు రావడంతో పోలీసులు షాక్ తిన్నారు. పోలీసులు పరుగులు తీశారు. మంటలు ఎక్కువగా కావడంతో కానిస్టేబుల్ అంజాత్.. నరసింహపై బెడ్ షీట్ కప్పి మంటలు ఆర్పి, ఆస్పత్రికి తరలించారు. నరసింహను కాపాడే ప్రయత్నంలో హోంగార్డు ప్రవీణ్‌కు తీవ్ర గాయాలయ్యాయి.

Also read

Related posts

Share this