SGSTV NEWS
Andhra PradeshCrime

ఇద్దరు పిల్లలను చంపి ప్రాణాలు తీసుకున్న తల్లి.. ఎందుకంటే?

ప్రతి ఇంట్లో అనందాలు వెలగాల్సిన దీపావళి పండుగ రోజున నల్గొండ జిల్లాలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. ఒక మహిళ తన ఇద్దరు పిల్లల ప్రాణాలు తీసి.. తర్వాత ఆమె కూడా ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఒక మహిళ పండగపూట ఇద్దరు పిల్లల ప్రాణాలు తీసి.. తర్వాత తాను ఆత్మహత్య చేసుకొని బలవన్మరణానికి పాల్పడిన ఘటన నల్గొండ జిల్లాలో వెలుగు చూసింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి వీరి మృతికి గల కారణాలు తెలుసుకునే పనిలో పడ్డారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నల్గొండ జిల్లా కొండమల్లెపల్లిలో సోమవారం రోజు ఈ విషాదం వెలుగు చూసింది. మృతులను కుంచాల నాగలక్ష్మి (27), ఆమె కుమార్తె అవంతిక (9), కుమారుడు భువన్‌ సాయి (7)గా పోలీసులు గుర్తించారు. అయితే వీరి స్వగ్రామం ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా జనకారం గ్రామం కాగా.. వీరు గత కొన్నాళ్లుగా నల్గొండ జిల్లాలోని కొండమల్లెపల్లిలో జీవిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.

అయితే వీరి మరణానికి కుటుంబ కలహాలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. గత కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవల జరుగుతున్నాయని.. వీరి మరణానికి ముందు రోజు కూడా భార్యభర్తల మధ్య గొడవ జరిగి.. రాత్రి భర్త ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడని స్థానికులు తెలిపినట్టు పోలీసులు వెల్లడించారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన నాగలక్ష్మి తన పిల్లలో కలిసి చనిపోయేందుకు ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు

Also read

Related posts