July 1, 2024
SGSTV NEWS
CrimeTelangana

Telangana: 40 శాతం కాలిన గాయాలతో లా విద్యార్థి.. మిస్టరీ వెనుక అసలు కథ ఇదేనా..!

సాధారణంగా వేడి నీళ్ళు చేతి మీద పడితేనే కొద్ది సేపు కూడా ఆ నొప్పిని ఓర్చుకోలేం. అలాంటిదీ ఒంటి మీద వేడి నీళ్ళు పడిన తర్వాత కూడా ఒక యువతి అరగంట పాటు నడుచుకుంటూ వెళ్ళింది. ఇది హైదరాబాద్ ఇక్‌ఫాయ్‌ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ చెప్పిన మాటలు. హైదరాబాద్‌ ఇక్‌ఫాయ్‌ యూనివర్సిటీలో లా ఫైనల్ ఇయర్ చదువుతోన్న లేఖ్యపై యాసిడ్ ఎటాక్ జరిగిందని, స్నానం చేసే బకెట్‌లో గుర్తు తెలియని వ్యక్తులు యాసిడ్ పోశారన్న ప్రచారం జరిగింది. అయితే నీళ్లే అనుకుని యువతి ఒంటిపై పోసుకున్నారని అనుమానం మరోవైపు. ఈ ఘటనలో లేఖ్య తీవ్రంగా గాయపడింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణలో సంచలన విషయాలను బయటపెట్టారు.

రెండు రోజుల క్రితం ఇక్‌ఫాయ్‌ యూనివర్సిటీలో ఫైనల్ ఇయర్ లా చదువుతున్న లేఖ్య అనే విద్యార్థిపై అనుమానాస్పద రీతిలో ఓ ఘటన జరిగింది. తన హాస్టల్ బాత్రూంలో స్నానం చేస్తున్న సమయంలో ఒంటి పై విపరీతమైన బొబ్బలు వచ్చాయి. ఆ దెబ్బలు చూసిన ఎవరికైనా ఇది యాసిడ్ అటాక్ అనే అనుమానం కలుగుతుంది. ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత యూనివర్సిటీ యాజమాన్యం స్పందించింది. లేఖ్య అనే విద్యార్థి స్నానం చేస్తున్న సమయంలో ఆమె శరీరంపై వేడి నీళ్లు పడటంతోనే ఆమె శరీరం అలా అయిపోయింది అంటూ యాజమాన్యం సమాధానం ఇచ్చింది.

అయితే వేడి నీళ్లు పడటంతోనే లేఖ్య శరీరంపై 40 శాతం కాలిన గాయాలు ఉన్నాయి. మే 15వ తేదీన రాత్రి 7 గంటలకు ఈ ఘటన జరిగినట్టు యూనివర్సిటీ యాజమాన్యం ధ్రువీకరించింది. అయితే ఇందులో యాసిడ్ దాడి ఎక్కడా లేదని, కేవలం వేడి నీరు పడటంతోనే ఆమె శరీరం అలా అయిపోయిందంటూ నిర్వాహకులు సమాధానం ఇచ్చారు. ఇప్పటికీ లేఖ్యా ఘటనపై పలు అనుమానాలు వేధిస్తూనే ఉన్నాయి. ఒకవేళ వేడి నీళ్లు పడి ఉంటే అరగంట పాటు రూమ్ లో నుండి ఎందుకు ఆమె బయటికి రాలేదనే ప్రశ్న కలచి వేస్తోంది. మరోవైపు యూనివర్సిటీ నిర్వాహకులు మాత్రం ప్రతి రూమ్ కు ఒక స్పెషల్ గ్రిల్ ఉంటుందని, ఇతరులు ఎవరు లోనికి ప్రవేశించే అవకాశం లేదని చెబుతున్నారు.. కానీ ఒంటిపై వేడి నీరు పడితే ఈ స్థాయిలో దెబ్బలు ఎలా తగులుతాయి అని అనుమానానికి మాత్రం ఎవరూ జవాబు ఇవ్వలేకపోతున్నారు.

Also read

Related posts

Share via