SGSTV NEWS
CrimeTelangana

Telangana: ప్రియుడితో కలిసి ఆరేళ్ల కొడుకును హతమార్చిన తల్లి..

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్‌కు చెందిన మంగళారపు మాధవి, మంగళారపు అరుణ్ కుమార్ అనే యువకుడిని ప్రేమ వివాహం చేసుకుని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. వీరికి ఒక కూతురు (8), ఒక కుమారుడు ఆరుష్ (6) ఉన్నారు. కొంతకాలం క్రితం మాధవి భర్త అరుణ్ అనారోగ్యంతో మృతి చెందాడు. భర్త మరణం తర్వాత మాధవి, కొనరావుపేట మండలం నిమ్మపల్లి గ్రామానికి చెందిన సామల్ల బాల కిషన్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.


తాజాగా మాధవి తన ప్రియుడితో కలిసి చిన్నారి ఆరుష్‌పై విచక్షణరహితంగా దాడికి తెగబడ్డారు. చిన్నారి తన తల్లికి బాలకృష్ణ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఈ దాడికి కారణమని సమాచారం. బాలుడిపై తీవ్రంగా దాడి చేయడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు బాలుణ్ణి కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆరుష్ తుదిశ్వాస విడిచాడు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.

మాధవితో అక్రమ సంబంధం పెట్టుకున్న కిషన్.. తమను, తమ కుటుంబ సభ్యులను తరచూ బెదిరింపులకు గురి చేసేవాడని మృతుడి నాయనమ్మ  అనసూర్య రోదిస్తూ తెలిపింది. పిల్లలు ఇద్దరినీ తమ వద్ద నుండి తీసుకెళ్లి మనవడి ప్రాణం తీసిందని ఆరోపించింది. మాధవి, కిషన్ ల అక్రమ సంబందానికి అడ్డుగా ఉన్నారనే నెపంతోనే వారు దాడి చేస్తేనే మనవడు ఆరుష్ మరణించాడని ఆవేదన వ్యక్తం చేసింది. కనీసం తమ మనవరాలినైనా తమకు అప్పగించాలని వేడుకుంది. మాధవి, కిషన్ నుండి తమకు ప్రాణహాని ఉందని, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది. ఆరుష్ తాత లక్ష్మీనారాయణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మాధవి, కిషన్ ఇద్దరు నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, రిమాండ్ కు తరలిస్తున్నట్లు తెలిపిన పోలీసులు.

Also read

Related posts

Share this