April 18, 2025
SGSTV NEWS
CrimeTelangana

తెలంగాణ : నాలుగేళ్ల బిడ్డతో సహా బావిలో దూకి తల్లి ఆత్మహత్య.. ఏం జరిగిందో?

జగిత్యాల,: జగిత్యాల జిల్లాలో ఘోర విషాదం జరిగింది. ఏం కష్టం వచ్చిందో ఏమోగానీ నాలుగు యేళ్ల కూతురుతో కలిసి ఓ తల్లి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర సంఘట జగిత్యాల జిల్లాసారంగాపూర్ మండలం అర్పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అర్పల్లి గ్రామానికి చెందిన బొండ్ల మౌనిక అనే వివాహిత నాలుగేళ్ల కూతురితో కలిసి బుధవారం రాత్రి ఊరిలోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ ఘటన జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో తీవ్రంగా మనస్థాపం చెందిన మౌనిక ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో గురువారం ఉదయం మృతదేహాలను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికి తీశారు. మృతురాలు మౌనిక భర్తను పోలీసులు అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తరలించారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Also read :కావలి పోలీసుల ప్రత్యేక కృషితో.. అంతరాష్ట్ర బైక్ దొంగలు అరెస్ట్!

మరో ఘటన.. బట్టలు ఆరేస్తుండగా విద్యుదాఘాతంతో తల్లీ, కొడుకు మృతి!
ఆంధ్రప్రదేశ్‌ ఏలూరు జిల్లాలో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతం జరిగి తల్లికొడుకు మృతి చెందారు. జిల్లాలోని ఆగిరిపల్లి మండలం ఈదర గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. గురువారం తడి బట్టలు తీగలపై ఆరేస్తుండగా పొరబాటున కరెంట్ వైర్లకు తడి బట్టలు తగిలాయి. దీంతో తల్లీ దొండపాటి నాగరత్నం, ఆమె కుమారుడు రామదాసు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Also read :అవసరం కోసం ఆ పని చేసిన వివాహిత.. అదే ప్రాణం తీసింది!

Related posts

Share via