ఎక్కడైన నేరాలు, మోసాలు జరిగితే మాకు సమాచారం ఇవ్వండి..క్షణంలో వస్తాం.. ఇక అనుమానిత వ్యక్తులు కనబడితే మాకు వెంటనే ఫోన్ చేయాలి..మేము వాళ్లను అదుపులోకి తీసుకుంటాం అని పదే పదే పోలీసులు చెప్పే మాటలు.. కానీ, ఆచరణలో మాత్రం అది అమలుకావడం లేదు.. ఇలాగే కొంతమంది అర్ధరాత్రి కష్టపడి ఓ దొంగను పట్టుకుని పోలీసులకు సమాచారం ఇస్తే వాళ్లు వచ్చి, ఆ దొంగను పట్టుకొని తీసుకొని వెళ్లకుండా, మీరే ఉదయం పోలీస్ స్టేషన్ కి తీసుకొని రమ్మని చెప్పి వెళ్లిపోవడంతో ఆ దొంగను పట్టుకున్న వ్యక్తులు ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే..
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దౌల్తాబాద్ సిమెంట్ పలకల తయారీ పరిశ్రమలో అర్ధరాత్రి సెల్ ఫోన్ దొంగలు బీభత్సం సృష్టించారు..ఆ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు నిద్రిస్తున్న సమయంలో ముగ్గురు దొంగలు వచ్చి అందులో మూడు సెల్ ఫోన్ లు ఎత్తుకెళ్లారు..ఈ దొంగలను అతి కష్టం పైన పట్టుకునే ప్రయత్నం చేశారు కార్మికులు..అందులో భాగంగా ఇద్దరు దొంగలు పారీపోగా ఒక దొంగ కార్మికుల చేతికి చిక్కాడు..సరే దొంగ దొరికాడు కదా అని, ఈ విషయాన్ని హత్నూర పోలీసులకు సమాచారం ఇచ్చారు కార్మికులు..సంఘటన స్థలానికి చేరుకున్న హత్నూర పోలీసులు..కార్మికుల అదుపులో ఉన్న దొంగను తీసుకెళ్లకుండా కార్మికులనే ఉదయం పోలీస్ స్టేషన్ కి తీసుకురావాలి అని సూచించారు..దీంతో ఆ దొంగను రాత్రంతా వారి వద్ద ఉంచుకోవడం గగనం అయిపోయింది కార్మికులకు.
దొంగ దొరికాడని పోలీసులకు సమాచారం ఇస్తే, అతన్ని తీసుకెళ్లకుండా మా వద్దే ఉదయం వరకు ఉంచడం సరైంది కాదంటూ హత్నూర పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు కార్మికులు.. ఒకవేళ అతని వల్ల మాకు ఏమైనా ఇబ్బంది కలిగితే, ఎవరూ బాధ్యత వహిస్తారంటూ పోలీసుల పై ఆగ్రహం వ్యక్తం చేశారు…కాగా కార్మికుల అదుపులో ఉన్న దొంగ పట్ల పోలీసులకు అంత ప్రేమ ఎందుకో అర్ధంకాలేదంటూ వాపోయారు.. పోలీసులు దొంగ పట్ల వ్యవహరించిన తీరు సర్వత్రా విమర్శలకు దారి తీస్తుంది.
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు..నిందితుడిని అదుపులోకి తీసుకోకపోగా ఉదయం తీసుకురావాలంటూ నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి..వాళ్లు ఎట్లగు పట్టుకోరు..కనీసం మనం పట్టించిన దొంగను సైతం పోలీస్ స్టేషన్ కి తీసుకు వెళ్లక పోవడం ఏంటబ్బా అని అందరి మెదడులను తొలుస్తున్న ప్రశ్న
Also read
- Maha Shivaratri Fasting: మహాశివరాత్రి ఉపవాసం ఎలా చేయాలి..? పాటించాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..!
- Maha Shivaratri: మహాశివరాత్రి రోజున ఈ పూజ చేసేవాళ్లకు శివుడి ప్రత్యేక ఆశీర్వాదం..! ఆ శివుడు మీ జీవితాన్నే మార్చేస్తాడు..!
- Gang rape : నిజామాబాద్ లో దారుణం..అక్కచెల్లెళ్లపై గ్యాంగ్ రేప్
- Atrocious : జగిత్యాలలో దారుణం … ఆస్తికోసం అన్నను చంపిన చెల్లెళ్లు
- POCSO case : సిద్ధిపేటలో ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు