April 3, 2025
SGSTV NEWS
CrimeTelangana

ఆట మొదలుపెడితే జీవితం మటాషే..! ప్రాణాలు తీస్తున్న బెట్టింగ్‌ యాప్స్



లక్కీ భాస్కర్‌ సంగతి దేవుడెరుగూ.. కన్నవాళ్లకు కడుపుకోత మిగిలిస్తూనే ఉంటారా..? లేటెస్ట్‌గా బెట్టింగ్‌ భూతానికి సోమేశ్‌ అనే యువకుడు బలయ్యాడు. బెట్టింగ్‌ యాప్స్ ఎంతలా వేధిస్తారో చెప్పాడు. ఒక్కసారి ఆటలోకి ఎంటరైతే… జీవితం ఎలా క్లోజ్‌ అవుతుందో తన చావుతో తెలిసేలా చేశాడు..


బీకేర్‌ ఫుల్‌ బ్రదరూ.. బెట్టింగ్‌తో పెట్టుకుంటే పోతారు..! సర్వనాశనం అయిపోతారు..! అని పదేపదే హెచ్చరిస్తున్నా పట్టించుకోకపోతే ఎలా..? వద్దురా బాబూ అని ఎంత మొత్తకున్నా వినకుండా బతుకులతో పందేలేస్తూ.. నేరగాళ్లను పెంచి పోషిస్తూనే ఉంటారా..? లక్కీ భాస్కర్‌ సంగతి దేవుడెరుగూ.. కన్నవాళ్లకు కడుపుకోత మిగిలిస్తూనే ఉంటారా..? లేటెస్ట్‌గా బెట్టింగ్‌ భూతానికి సోమేశ్‌ అనే యువకుడు బలయ్యాడు. బెట్టింగ్‌ యాప్స్ ఎంతలా వేధిస్తారో చెప్పాడు. ఒక్కసారి ఆటలోకి ఎంటరైతే.. జీవితం ఎలా క్లోజ్‌ అవుతుందో తన చావుతో తెలిసేలా చేశాడు.


ఈజీమనీ వేటలో బెట్టింగ్‌కి అడిక్ట్ అవుతున్నారు. లక్కు కలిసి వస్తుందనే ఆశతో లక్షల రూపాయలు బెట్టింగ్‌లకు తగలేస్తున్నారు. ఉన్నతోద్యోగుల నుంచి రోజుకూలీల వరకు, గృహిణుల నుంచి విద్యార్థుల వరకు చాలామంది ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లకు బానిసలవుతున్నారు. కన్నవారు, కట్టుకున్నవారు, కడుపున పుట్టినవారిని అనాథలను చేసి చివరికి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా అనేక పట్టణాలూ పల్లెల్లోనూ ఆన్‌లైన్‌ జూదక్రీడలకు సామాన్య జనజీవనం ఛిద్రమవుతోంది. లేటెస్ట్‌గా మేడ్చల్‌ జిల్లా గౌడవెల్లి గ్రామానికి చెందిన 24ఏళ్ల సోమేష్‌ బెట్టింగ్‌కి బానిసై.. అప్పుల బాధలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు.

గతకొన్నిరోజులుగా బెట్టింగ్‌ యాప్‌లపై తెలుగు రాష్ట్రాల్లో రచ్చరచ్చ జరుగుతోంది. వద్దురా నాయనా బెట్టింగుల జోలికెళ్లొందంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూనే ఉన్నారు. బెట్టింగ్ భూతానికి బలికావొద్దంటూ ప్రకటనలిస్తున్నారు. అంత చేస్తున్నా.. సోమేష్‌లాంటి వాళ్లు చనిపోవడం దారుణమనే చెప్పాలి. అయితే సోమేష్‌ బెట్టింగ్‌లో మొదటిసారి డబ్బు పోగొట్టుకుని చనిపోలేదు. గతంలో బెట్టింగులు పెట్టి అప్పులైతే.. కుటుంబమే బయటపడేసింది. కానీ ఆ యాప్‌లు మాత్రం సోమేష్‌ను వెంటాడుతూనే ఉన్నాయి. ఎంతలా అంటే.. మైండ్‌ కరాబ్‌ చేసేంతలా..! బెట్టింగ్‌ పెట్టకపోతే మానసికంగా కుంగిపోయేంతలా బానిసను చేశాయీ బెట్టింగ్‌ యాప్స్.


ఎంత కంట్రోల్ చేసుకుంటున్నా మైండ్ సెట్ కావడంలేదు..
ఎంత కంట్రోల్ చేసుకుంటున్నా మైండ్ సెట్ కావడంలేదన్నది చనిపోయే ముందు సోమేష్ కుమార్ ఆవేదన. మనుషుల్ని ఎంతలా మానసికంగా కుంగదీస్తున్నాయో, ఎలా బానిసల్ని చేస్తున్నాయో సోమేష్‌ స్టేటస్ చూస్తే తెలుస్తుంది.

అంతేకాదు… చనిపోయే ముందు ఫ్రెండ్‌తో ఫోన్‌లో మాట్లాడిన సోమేశ్‌ ఇదే విషయాన్ని చెప్పాడు. బెట్టింగ్‌ నుంచి బయటపడేందుకు ఎంత ప్రయత్నించినా వల్ల కావట్లేదన్నాడు.

చూశారుగా…! ఇంతలా ఓ మనిషిని వేధిస్తూ, వెంటాడుతూ, ప్రాణాలు తీసుకుంటున్నాయి బెట్టింగ్‌ యాప్స్. ఇక కొడుకు మరణంతో కుంగిపోయిన సోమేష్‌ తల్లి… కన్నీళ్లతో మాట్లాడిన మాటలు ఆలోచింపజేస్తున్నాయి. అటు ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నాయ్.

మొత్తంగా.. కష్టపడకుండానే కాసులు కూడబెట్టాలన్న అత్యాశే మనిషిని జూదంవైపు నెడుతుంది. ఒక్కసారి అటువైపు వెళ్లారా… జీవితాలనే ఛిదిమేస్తోంది. ఇలా బెట్టింగ్ వ్యసనాలతో సర్వనాశనమైన కుటుంబాల దయనీయ గాథలెన్నో ఊరూరా వినపడుతున్నాయి. సో బీర్ కేర్. బెట్టింగుల జోలికి వెళ్లకండి. బెట్టింగులు ఆడుతున్నవారు ఇకనైనా మారండి

Also read

Related posts

Share via