ఇవి మంచి రోజులు కావు.. కుటుంబ బంధాలంటే విలువు లేవు. డబ్బే ప్రధానమైపోయింది. ఆ డబ్బు కోసం ఏం చేసేందుకు అయినా వెనకాడం లేదు. కొందరు అయితే ఏకంగా కుటుంబ సభ్యులనే మట్టుబెడుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే.. సంగారెడ్డి జిల్లాలో వెలుగుచూసింది…
ఇది మరో దారుణం.. బావను బామ్మర్ది చంపేసిన క్రైమ్ స్టోరీ ఇది.. బావ, బావమరిది.. ఇద్దరు కలిసి JCB వాహనం కొన్నారు ఈ క్రమంలో బావమరిది మెదడులో దారుణమైన ఆలోచన తట్టింది. బావను చంపిస్తే.. వెహికల్‌పై ఉన్న లోన్ మాఫీ అవుతుందన్నదే అతని మైండ్‌లోకి వచ్చిన దారుణం. ఆలోచన వచ్చిందే తడువుగా స్నేహితుడుతో కలిసి ఆపరేషన్ చేపట్టాడు. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది ఈ దారుణం. అమీన్‌పూర్‌లో నివాసముంటున్న బానోతు గోపాల్ నాయక్‌ను తన మిత్రునితో కలిసి హత్య చేసి మృతదేహాన్ని స్మశాన వాటికలో వదిలివెళ్లాడు నరేష్ నాయక్.
వీరిది మెదక్ జిల్లా పాపన్నపేట్‌గా పోలీసులు గుర్తించారు. బావ, బామ్మర్ది కలిసి JCB వాహనం కొనుగోలు చేశారని.. బావను హత్య చేస్తే అతని పేరుపై ఉన్న JCB లోన్ మాఫీ అవుతుందని హత్య చేసినట్లు పోలీసులకు అందిన ప్రాథమిక సమాచారంలో తేలింది. దర్యాప్తు చేపట్టిన అమీన్‌పూర్ పోలీసులు.. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని పటాన్‌చెరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. హత్య వెనుక ఉన్న పూర్తి మిస్టరీని చేధించే పనిలో ఉన్నారు పోలీసులు
Also read
- లేడీ కాదు.. మహా కిలాడీ.. వైద్యురాలిగా నటిస్తూ!
- సాహితీవేత్తా దుర్గాప్రసాద్ ఉగాది పురస్కారం ఇవ్వనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
- పరాభావ నామసంత్సరం అంటే అన్నీ పరాభావాలేనా? పండితులు ఏమంటున్నారంటే?
- Watch Video: ఏటీఎంలో చోరీకి విఫల యత్నం.. సైరన్ మోగడంతో పరార్! ఎక్కడంటే..
- ఆరుగురు మహిళలు.. ధూమ్ సినిమా రేంజ్లో ప్లాన్.. చివరకు జరిగిందిదే..





