April 11, 2025
SGSTV NEWS
CrimeTelangana

Telangana: అయ్యో ఎంత పనైంది.. భార్య కాపురానికి రావడం లేదని ఇద్దరు పిల్లలతో కలిసి..



తెలంగాణలోని సిద్దిపేట పట్టణంలో దారుణం చోటుచేసుకుంది.. తన భార్య కాపురానికి రావడం లేదని ఓ వ్యక్తి తన ఇద్దరు పిల్లలతో కలిసి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అతనితోపాటు ఇద్దరు చిన్నారులు చెరువులో మునిగి చనిపోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.


సిద్దిపేటలో దారుణం చోటుచేసుకుంది.. తన భార్య కాపురానికి రావడం లేదని ఓ వ్యక్తి తన ఇద్దరు పిల్లలతో చింతల్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతులు సిద్దిపేట వాసవి నగర్ కు చెందిన తేలు సత్యం (48), అతని కొడుకు అన్వేష్ (7), కూతురు త్రివేణి (5) పోలీసులు గుర్తించారు. మృతి చెందిన ఇద్దరు చిన్నారులను చూసి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కుటుంబ కలహాలతోనే ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. మృతుడు సత్యం రెండో భార్య తేలు శిరీష గత కొంతకాలంగా అతనికి దూరంగా ఉంటోంది.. దీంతో మనస్తాపంతో పిల్లలతో కలిసి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు.


కాగా సత్యంకు మొదట ఒక పెళ్లి అయింది.. ఆ తర్వాత మొదటి భార్య మృతి చెందింది.. ఆమెకు ఇద్దరు పిల్లలు(పెద్దవారు).. మొదటి భార్య చనిపోయిన అనంతరం సత్యం రెండవ పెళ్లి చేసుకున్నాడు.. రెండవ భార్య శిరిషకు ఇద్దరు పిల్లలు.. కాగా గత కొద్దిరోజులుగా సత్యంకు అనారోగ్య సమస్యలు రావడం..దీనికి తోడు ఇంట్లో కూడా గొడవలు జరగడంతో.. రెండవ భార్య శిరీష ఇంట్లో నుండి వెళ్ళిపోయింది. కొన్ని రోజులుగా ఆమె తిరిగి ఇంటికి రాకపోవడంతో మనస్తాపం చెందిన సత్యం..తన రెండవ భార్య పిల్లలతో కలిసి ఎర్రచెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

సిద్దిపేట టూ టౌన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను బయటకు తీశారు.. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు

Also read

Related posts

Share via