మియాపూర్‌లో 12 ఏళ్ల బాలిక కనిపించికుండా పోయినట్లు ఇటీవల మిస్సింగ్ కంప్లైంట్ నమోదయింది. అయితే ఆ బాలిక విగతజీవిగా ఇంటికి సమీపంలో గుర్తించడంతో విషాద ఛాయలు అలముకున్నాయి. పొట్టకూటికోసం బాలిక తల్లిదండ్రులు నరేశ్, శారదలు నెల క్రితమే నగరానికి వచ్చారు. నడిగడ్డ తండాలో నివాసం ఉంటూ.. కూలి పనులకు వెళ్తున్నారు. అయితే జూన్ 7 ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాలిక.. మళ్లీ తిరిగిరాలేదు. పనులు ముగించుకుని రాత్రి 9 గంటలకు ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు.. కుమార్తె కనిపించకపోవడంతో ఆందోళన చెందారు.
మియాపూర్‌లో 12 ఏళ్ల బాలిక కనిపించికుండా పోయినట్లు ఇటీవల మిస్సింగ్ కంప్లైంట్ నమోదయింది. అయితే ఆ బాలిక విగతజీవిగా ఇంటికి సమీపంలో గుర్తించడంతో విషాద ఛాయలు అలముకున్నాయి. పొట్టకూటికోసం బాలిక తల్లిదండ్రులు నరేశ్, శారదలు నెల క్రితమే నగరానికి వచ్చారు. నడిగడ్డ తండాలో నివాసం ఉంటూ.. కూలి పనులకు వెళ్తున్నారు. అయితే జూన్ 7 ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాలిక.. మళ్లీ తిరిగిరాలేదు. పనులు ముగించుకుని రాత్రి 9 గంటలకు ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు.. కుమార్తె కనిపించకపోవడంతో ఆందోళన చెందారు. ఇరుగుపొరుగువారితో కలిసి చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించారు. ఆచూకి లభించకపోవడంతో.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తమ బిడ్డ ఎక్కడో ఓ చోట క్షేమంగానే ఉండి ఉంటుందని, ఆచూకీ దొరుకుతుందని ఆ దంపతులు ఆశగా ఎదురుచూశారు. తనకి ఏం కాకూడదని దేవుళ్లకు మొక్కుకున్నారు. కానీ చేదువార్త రానే వచ్చింది. వారు నివాసం ఉంటున్న ప్రదేశం నుంచి 130 మీటర్ల దూరంలో బాలిక వసంత డెడ్‌బాడీ లభ్యమైంది. చెట్ల పొదల్లోంచి దుర్వాసన వస్తున్నట్లు.. అక్కడ నివాసం ఉండేవారు గురువారం రాత్రి పోలీసులకు తెలిపారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించగా కుళ్లిపోయిన స్థితిలో డెడ్‌బాడీ కనిపించింది. బాలిక పేరెంట్స్‌కు పోలీసులు సమాచారం అందించారు. మృతదేహంపై ఉన్న దుస్తులను గమనించి ఆమె తమ కుమార్తెనని గుర్తించారు. నరేష్, శారద దంపతులు మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం లక్ష్మతండాకు చెందినవారు. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న బిడ్డ మృతితో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధిస్తున్నారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.