భారతీయ జనతా పార్టీలో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ హత్యకు కుట్ర పన్నిన్నారా..? స్థానికులు పట్టుకున్న ఆ ఇద్దరు ఎవరు..? ఫోన్లలో గన్, బుల్లెట్లు, రాజాసింగ్ ఫొటోలు పెట్టుకుని తిరుగుతున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోలీసలు తెలిపిన వివరాల ప్రకారం.. ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటి పరిసరాల్లో ఇద్దరు అనుమానితులు సంచరిస్తున్నట్లు స్థానికులు గుర్తించారు. మొదట అంతగా పట్టించుకోని జనం, రాజాసింగ్ ఇంటి దగ్గర రెక్కీ నిర్వహిస్తుండటంతో ఆరా తీశారు. దీంతో వారి ఇద్దరి సెల్‌ఫోన్లలో గన్, బుల్లెట్లు, రాజాసింగ్ ఫొటోలు కనిపించడంతో షాక్ అయ్యారు. వెంటనే ఇద్దరు పట్టుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఇద్దరిని పట్టుకుని మంగళహాట్ పోలీసులకు అప్పగించారు స్థానికులు. నిందితులను షేక్ ఇస్మాయిల్, మహ్మద్ ఖాజాగా గుర్తించిన మంగళహాట్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. అసలు వీరిద్దరూ రెక్కీ నిర్వహించడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
ఇదిలావుంటే, ఎమ్మెల్యే రాజా సింగ్ హిందుత్వం అంశంలో బలమైన గళం వినిపిస్తున్నారు. గతంలో రాజాసింగ్ హత్యకు పన్నని పన్నాగాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. గుజరాత్ లోని సూరత్ నగరంలో జరిగిన సోదాల్లో ఒక మౌళ్వీ ని అదుపులోకి తీసుకున్నారు. పాకిస్థాన్ , నేపాల్ లో కొందరు నుంచి వస్తున్న ఆదేశాల ఆధారంగా ఈ కుట్ర అమలు చేస్తున్నట్లుగా సూరత్ పోలీస్ కమిషనర్ వెల్లడించారు. ఈ హత్య కోసం కోటి రూపాయల సుపారిని ఆఫర్ చేసినట్లు వివరించారు. పాకిస్తాన్ నుంచి నేపాల్ మీదుగా మారణాయుధాలు అందించేటట్లుగా ఒప్పందం కుదిరినట్లు గతంలో సూరత్ పోలీసులు గుట్టురట్టు చేశారు
Also Read
- Telangana: హైదరాబాద్లో కాల్పుల కలకలం.. గన్తో ఏపీ మాజీ డిప్యూటీ సీఎం తమ్ముడు..
- Watch Video: సర్కార్ బడి టీచరమ్మ వేషాలు చూశారా? బాలికలతో కాళ్లు నొక్కించుకుంటూ ఫోన్లో బాతాఖానీ! వీడియో
- ప్రైవేటు స్కూల్ బాలికపై అర్ధరాత్రి లైంగికదాడి!
- నేటి జాతకములు…5 నవంబర్, 2025
- అప్పు కోసం పిన్నింటికి వచ్చిన వ్యక్తి.. భార్యతో కలిసి ఏం చేసాడో తెలుసా..?





