April 18, 2025
SGSTV NEWS
CrimeTelangana

Telangana: కొమురవెళ్లి మల్లన్న సన్నిధిలో అఘోరీ నాగసాధువు హల్‌చల్.. ఏకంగా కత్తితో..!


Telangana: కొమురవెళ్లి మల్లన్నఅఘోరాలైనా..అఘోరీలైనా..ఏళ్ల తరబడి హిమాలయాల్లో తపమాచరిస్తుంటారు. కుంభమేళా సమయంలోనే జనం మధ్యకు వస్తారు. కానీ ఉన్నట్టుండి తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యక్షమైన ఓ అఘోరీ..ఎప్పుడూ లేనంతగా న్సూసెన్స్‌ క్రియెట్‌ చేస్తోంది. నడిరోడ్డుపై ఈ అఘోరీ చేష్టలు..ఇటు జనానికి, అటు పోలీసులను చికాకు తెప్పిస్తున్నాయి ఇటీవల ఆమెపై కేసు కూడా నమోదైంది..


లేడీ అఘోరీ మరోసారి హల్చల్ చేసింది. ఆలయ రాజగోపురం నుండి ప్రధాన ద్వారం గుండా స్వామివారి దర్శనం కల్పించాలని ఆలయ అధికారులను కోరింది. అందుకు ఆలయ సిబ్బంది నిరాకరించడంతో హంగామా సృష్టించింది. ఏకంగా తన దగ్గర ఉన్న కత్తితో ఆలయం వద్ద ఉన్న భక్తులపైకి దూసుకెళ్లింది. ఆ ఘటనతో అక్కడ ఉన్న భక్తులందరూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.


సిద్దిపేట జిల్లాలో ఉన్న ప్రముఖ శైవక్షేత్రమైన కొమురవెళ్లి మల్లికార్జున స్వామి ఆలయంలో అఘోరీ నాగసాధువు హల్‌చల్ చేసింది. మంగళవారం(జనవరి 28) ఉదయం ఆలయ రాజగోపురం నుండి ప్రధాన ద్వారం ద్వారా స్వామి వారి దర్శనం కల్పించాలని ఆలయ అధికారులను కోరింది. అయితే బట్టలు వేసుకుని స్వామివారి దర్శనం చేసుకోవాలని, లేదంటే దర్శనానికి అనుమతి లేదని ఆలయ అధికారులు తేల్చి చెప్పారు. ఆ కోపంతో తిరిగి కారులో కూర్చొని బయటకు రాకపోవడంతో ఆలయ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నించారు.

ఈ క్రమంలోనే లేడీ అఘోరీని దుస్తులు వేసుకోవాలని కోరారు. ఈ సమయంలో ఆలయ రాజగోపురం వద్ద భక్తులు అఘోరీని చూసేందుకు భారీగా భక్తులు రావడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆ కోపంతో తన కారులో ఉన్న కత్తితో పలువురు భక్తులపై దాడి చేసేందుకు ప్రయత్నించింది నాగ సాధువు. అనంతరం ఆలయ అధికారులు నచ్చచెప్పడంతో బట్టలు వేసుకుని స్వామివారి దర్శనం చేసుకుని కొమురవెళ్లి నుండి వెళ్ళిపోయింది. దీంతో ఆలయ అధికారులు ఉపిరి పీల్చుకున్నారు.

Also read

Related posts

Share via