SGSTV NEWS
Andhra PradeshCrime


ఛీ ఛీ.. చచ్చే వయసులో ఇవేం పాడు పనులు.. ఆ వీడియోలకు బానిసై.


నీలి చిత్రాలకు అలవాటు పడిన ఓ వృద్ధుడు పిల్లలతో కామవాంఛ తీర్చుకుంటున్నాడు. ఆరు బయట ఆడుకుంటున్న చిన్నారులకు మాయ మాటలు చెప్పి వారితో అసభ్యకరంగా ప్రవర్తించే వాడు. గత కొన్ని రోజులుగా ఆ వృద్ధిడి ప్రవర్తనను గమనించిన స్థానికులు తాజాగా ఆ కామాంధుడిని పట్టుకొని చితకబాది పోలీసులకు అప్పగించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మనవళ్లతో ఆడుకోవాల్సిన వయస్సులో ఓ వృద్దుడు మనవళ్ల వయస్సున్న పిల్లలో ఆసభ్యకరంగా ప్రవర్థిస్తూ కామాందుడిగా మారాడు. గత కొన్ని రోజులుగా నీలి చిత్రాలకు అలవాటు పడిన ఓ వృద్ధుడు పిల్లలతో కామవాంఛ తీర్చుకుంటున్నాడు. ఆరు బయట ఆడుకుంటున్న చిన్నారులకు మాయ మాటలు చెప్పి వారితో అసభ్యకరంగా ప్రవర్తించే వాడు. గత కొన్ని రోజులుగా ఆ వృద్ధిడి ప్రవర్తనను గమనించిన స్థానికులు తాజాగా ఆ కామాంధుడిని పట్టుకొని చితకబాది పోలీసులకు అప్పగించారు.ఈ ఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండలం తీగారం గ్రామంలో వెలుగు చూసింది.

స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోగు సోమయ్య అనే వృద్ధుడు 68 ఏళ్ల వృద్ధుడు స్మార్ట్ ఫోన్‌లో పోర్న్ వీడియోలకు అలవాటు పడ్డాడు. పోర్న్ వెబ్ సైట్ లో వీడియోలు చూస్తూ కామాందుడిగా మారాడు. తన కామవాంఛ తీర్చుకొనేందుకు స్థానికంగా ఉండే చిన్నారులతో అతను అసభ్యకరంగా ప్రవర్తించేవాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఆరు బయట ఆడుకుంటున్న చిన్నారులకు మాయమాటలు చెప్పి, చిరుతిండికి అలవాటు చేసి వారితో అసభ్యకరంగా ప్రవర్తించేవాడని.. అతని అసభ్యప్రవర్తన, జరిగిన విషయాన్ని చిన్నారులు తల్లితండ్రులకు చెప్పడంతో నిందితుడు పోగు సోమయ్యను గ్రామస్తులు చితకబాది, ఆ తర్వాత అతన్ని పాలకుర్తి పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు.

సోమయ్య చిన్నారులతో అసభ్యంగా ప్రవర్థిస్తున్నట్టు కంప్లైంట్‌లో పేర్కొన్నారు. చిన్నారుల తల్లిదండ్రుల ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న పోలీసులు నిందితుడు సోమయ్యపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే తీగారం గ్రామంలోనే గత పది రోజుల వ్యవధిలో ఇది రెండో పోక్సో కేసు నమోదు కావడం విశేషం.

Also read

Related posts

Share this