SGSTV NEWS
CrimeTelangana

Hyderabad: జ్యూస్ తాగుతూ కుప్పకూలిన యువకుడు.. స్పాట్‌లోనే గుండెపోటుతో మృతి!



గుండెపోటు మరణాలు రోజురోజుకూ పెరుగుతూ తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా చాలామంది గుండెపోటుతో అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. జ్యూస్ తాగుతుండగా యువకుడికి గుండెపోటు వచ్చింది. సీపీఆర్ చేసిన ఫలితం లేకపోయింది.

గుండెపోటు మరణాలు రోజురోజుకూ పెరుగుతూ తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా చాలామంది గుండెపోటుతో అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. జ్యూస్ తాగుతుండగా యువకుడికి గుండెపోటు వచ్చింది. అతన్ని గమనించేలోపే.. స్పాట్‌లోనే ఆ యువకుడు తుది శ్వాస విడిచాడు. చనిపోయిన యువకుడి వయస్సు 30ఏళ్లు. ఈ విషాదకర ఘటన స్థానిక సీసీ కెమెరాల్లో రికార్డయింది.

ఖమ్మం జిల్లా పల్లెపాడుకు చెందిన ఏకలవ్య (30) అనే యువకుడు.. ఇబ్రహీంపట్నం మున్సిపల్ కేంద్రంలోని మిత్రుడితో కలిసి ఉంటున్నాడు. ఈ క్రమంలోనే బుధవారం (సెప్టెంబర్ 17) రాత్రి జ్యూస్ తాగేందుకు జ్యూస్ సెంటర్‌కు వచ్చాడు. అక్కడే నిల్చొని జ్యూస్ తాగుతున్న ఏకలవ్య ఒక్కసారిగా కుప్ప కూలిపోయాడు. అతన్ని గమనించిన స్థానికులు సిపిఆర్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అంబులెన్స్ అందుబాటులో లేక పోవడంతో హుటాహుటిన పోలీస్ వాహనంలోనే హాస్పిటల్‌కి తరలించారు. అయితే అప్పటికే ఏకలవ్య మృతిచెందిన చెందినట్లు వైద్యలు నిర్ధారించారు. 30 ఏళ్లకే యువకుడు ఏకలవ్య గుండెపోటుతో మృతి చెందడం పట్ల స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.. యువకుడి మృ పోస్టుమార్టం నిమిత్తం ఇబ్రహీంపట్నం మార్చురికి తరలింపు.

Also read

Related posts

Share this