ఒకరికి ఒకరంటే.. చాలా ప్రాణం.. ఇద్దరూ ప్రేమించుకున్నారు.. కట్ చేస్తే.. రాత్రివేళ ప్రేమజంట ఓ హోటల్‌లో దిగింది. ఓయో రూమ్‌లోకి గుట్టుచప్పుడు కాకుండా వెళ్లిన ప్రియుడు.. ప్రియురాలు అప్పటివరకు బాగానే ఉన్నారు.. చివరకు ఏం జరిగిందో ఏమో కానీ.. తెల్లారేసరికి ప్రియుడు ఆస్పత్రిలో చేరితే.. ప్రియురాలు పోలీసుల అదుపులో ఉంది.
ఓయో హోటల్‌లో ఓ యువకుడి ఆత్మహత్యాయత్నం ఘటన హైదరాబాద్ నగరంలో కలకలం రేపింది. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామాంతపూర్ ప్రగతి నగర్‌లోని ఓయో రూంలో రాత్రివేళ ప్రేమజంట దిగారు.. ఓంకార్ అనే యువకుడితోపాటు.. మరో యువతి హోటల్ కు వచ్చారు.. ఈ క్రమంలో తెల్లవారుజామున ఇద్దరి మధ్య గొడవ జరిగింది.. దీంతో మనస్తాపం చెందిన ప్రియుడు ఓంకార్ ఆత్మహత్యాయత్నం చేశాడు.. దీంతో అతన్ని హోటాహుటిన హోటల్ సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. హోటల్ యాజమాన్యం ఫిర్యాదుతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. ఓంకార్ ప్రియురాలిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ మొత్తం చదవాల్సిందే..
అసలేం జరిగిందంటే..
బోరబండకు చెందిన ఓంకార్, జనగాం జిల్లాకు చెందిన సౌమ్య అనే ప్రైవేట్ బ్యాంకు ఉద్యోగులు… గత కొన్ని నెలలుగా ప్రేమలో ఉన్నారు. సౌమ్య ఉప్పల్‌లోని ఒక ప్రైవేట్ హాస్టల్లో నివసించేది. ఓంకార్ బొరబండలో నివసించేవాడు. ఈ నేపథ్యంతోనే వారు ఆదివారం సాయంత్రం రామంతపూర్‌లో ఓ ఓయో హోటల్‌లో ఒక గది బుక్ చేశారు. ఆదివారం సాయంత్రం ఇద్దరూ హోటల్ గదిలోకి వెళ్లాక, సౌమ్య ఓంకార్ తో పెళ్లి ప్రస్తావని తెచ్చింది. దీంతో ఇద్దరు మధ్య కొన్ని విభేదాలు ఏర్పడ్డాయి.. అయితే, అప్పటికే మద్యం సేవించి ఉండటంతో ఒకరిపై ఒకరు దూషించుకునే స్థితికి వెళ్లారు. తెల్లవారుజామున నాలుగు గంటల వరకు వీరి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తుంది. అప్పటికే ఇద్దరూ మద్యం మత్తులో ఉన్న వారు తీవ్రంగా ఘర్షణ పడ్డారు.
ఈ ఘర్షణతో ఓంకార్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. తన ప్రేమ జీవితం సంక్షోభంలో పడినట్లు భావించి కోపంలో.. రూమ్‌లో ఉన్న ఫ్యాన్‌కు సౌమ్య చున్నీతో ఉరేసుకునేందుకు ప్రయత్నించాడు. సౌమ్య ఈ సంఘటనను చూసి వెంటనే కంగారుపడింది. వెంటనే ఆమె హోటల్ సిబ్బందిని అప్రమత్తం చేసింది..హోటల్ సిబ్బంది వేగంగా స్పందించి, ఓంకార్‌ను తక్షణమే సమీపంలోని ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతానికి అతను రామంతపూర్‌లోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.. పోలీసులు, ఓంకార్ పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ, సౌమ్యను విచారణకు పిలిపించారు.
ఈ ఘటన గురించి తెలుసుకున్న ఇద్దరి కుటుంబ సభ్యులు వెంటనే హాస్పిటల్‌కు చేరుకున్నారు. ప్రేమికులు, కుటుంబ సభ్యుల అభిప్రాయాలతోపాటు.. పలు కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు.
Also read
- Andhra Pradesh: 10 నిమిషాల్లో ఇంటికి చేరేవారే.. కానీ అంతలోనే కబలించిన మృత్యువు!
- అయ్యో పాపం.. ఐదేళ్లకే ఆ బాలుడికి ఆయుష్షు తీరిపోయింది..!
- ఎస్బీఐ బ్యాంకుకు కన్నం.. రూ.13 కోట్ల విలువ చేసే బంగారం లూటీ.. లబోదిబోమంటున్న కస్టమర్లు
- స్కూల్‌కి వెళ్లాల్సిన బాలుడు.. బావిలో శవమై తేలాడు.. మిస్టరీగా మారిన మరణం
- డబ్బులిస్తాం.. అంటూ ఇంటికి పిలిచిన దంపతులు.. చివరకు ఏం జరిగిందంటే..
మహిళలపై కేటీఆర్ వ్యాఖ్యలు సరికావు
…అంకన్నగారి నాగరాజ్ గౌడ్*