ఎయిర్‌లైన్స్‌లో పనిచేస్తున్న ఒక ఎయిర్ హోస్టస్‌ను ఉప్పల్‌కు చెందిన ఒక యువకుడు వేధింపులకు పాల్పడ్డాడు. యువతి ఫిర్యాదుతో ఎస్ ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అమీర్‌పేటలోని గ్రీన్‌ల్యాండ్ హోటల్‌లో ఈ ఘటన జరిగింది. టెంపరరీ స్టే కోసం రూమ్‌ను ఎయిర్ హోస్టస్ బుక్ చేసుకుంది. అదే హోటల్‌లోని రెస్టారెంట్‌లో మార్చి 25న డిన్నర్ చేసి తిరిగి తన రూమ్‌కు వెళ్లే క్రమంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.
తన రూమ్‌కు ఎయిర్ హోస్టస్‌ను వెనకాల నుండి ఒక యువకుడు ఫాలో అయ్యాడు. రెస్టారెంట్‌లో సైతం ఎయిర్ హోస్టస్‌పై అనుచితంగా ప్రవర్తించాడు. డిన్నర్ పూర్తి చేసుకుని ఆమె రూముకు వెళ్లేందుకు లిఫ్ట్ ఎక్కింది. అయితే ఆమెను వెనకాల నుండి ఫాలో అయిన యువకుడు అదే లిఫ్టులో ఎక్కాడు. తీరా ఎయిర్ హోస్టస్ రూమ్ లోకి వెళ్లేసరికి ఆమె వెనకాలే నేరుగా రూమ్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. దీంతో ఒకసారిగా కంగుతిన్న యువతి లోపల నుండి గదిని లాక్ చేసింది. ఐదు నిమిషాల పాటు వెయిట్ చేసిన యువకుడు బెల్ నొక్కుతూ వేధింపులకు పాల్పడ్డాడు. ఎంతసేపటికి లోపల ఉన్న యువతి నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో తిరిగి వెళ్లి ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో యువతి హోటల్ సెక్యూరిటీకి ఘటనను వివరించింది.
హోటల్ సిబ్బందితోపాటు యువత ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఆర్ నగర్ పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా యువకుడు ఉప్పల్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతనిపై వేధింపుల కేసును నమోదు చేశారు. యువకుడి ప్రవర్తనతో ఒక్కసారిగా ఎయిర్ హోస్టస్ కంగుతింది. హోటల్ సెక్యూరిటీ కూడా సరైన టైంలో స్పందించింది. అయితే హోటల్ సిబ్బంది. వచ్చేలోపే యువకుడు అక్కడి నుండి పరారయ్యాడు. దీంతో యువతి సేఫ్‌గా ఉంది. వెంటనే ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఆ యువకుడిపై జరిగిన ఘటనను వివరించారు. సీసీ టీవీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. యువకుడును అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మార్చి 26న పోలీసులు కేసు నమోదు చేశారు. యువతిని వేధించిన ఘటనకు పాల్పడిన పాల్పడిన యువకుడిపై BNS 78 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు
Also read
- సీతాదేవి తనువు చాలిస్తూ భూమిలో ఐక్యం అయిన ప్రదేశం ఎక్కడుందో తెలుసా..
- దైవ దర్శనకోసం వెళ్తే దారుణం.. ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే.. సంచలన విషయాలు..
- శ్రీ రామ నవమి పండగ విషయంలో గందరగోళం.. ఏప్రిల్ 5 లేదా 6 ఎప్పుడంటే
- మహిళల రుతు సమయం గురించి గరుడ పురాణం ఏం చెబుతుందో తెలుసా..?
- AP Crime: ఏపీలో దారుణం.. యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన యువతి!