మేడ్చల్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణ ఘటన వెలుగుచూసింది. ఓ మహిళను గుర్తు తెలియని వ్యక్తులు.. ముక్కు, చెవులు కోసి దారుణంగా హత్య చేశారు. ఆపై మృతదేహానికి నిప్పు పెట్టారు. ఇంటి నుంచి పొగలు రావడంతో స్థానికులు వెళ్లి చూడగా.. మహిళ సగం కాలిపోయిన స్థితిలో కనిపించింది.
మనుషులు పర్వర్టుల్లా తయారువుతున్నారు. నేర ప్రవృత్తి నానాటికి పెరిగిపోతుంది. కొందరైతే అయినవాళ్లనే అంతమొందిస్తున్నారు. క్షణికావేశంలో జరుగుతున్నాయ్ అనుకోడానికి లేదు. పక్కా ప్లాన్‌తో హత్యలు చేస్తున్నారు. కొందరు సైకోల్లా క్రైమ్స్‌కు తెగబడుతున్నారు. హైదరాబాద్ గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో కన్నతండ్రే 14 రోజుల బిడ్డను పాశవికంగా గొంతు కోసి హత్య చేశాడు. తాజాగా మరో దారుణం వెలుగులోకి వచ్చింది. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధి అత్వెల్లి గ్రామంలో ఓ మహిళను అతి కిరాతకంగా గొంతు, చెవులు కోసి హత్య చేశారు. అనంతరం మృతదేహానికి నిప్పు పెట్టారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు.
వికారాబాద్ జిల్లాకు చెందిన లక్ష్మి వయస్సు దాదాపు 50 ఏళ్లు ఉంటుంది. ఆమె అత్వెల్లిలో ఓ రేకుల షెడ్డూలో నివాసం ఉంటుంది. స్థానికంగా ఓ వైన్స్‌లో పనికి కుదిరింది. అక్కడ ఆమెకు రోజుకు ఇంత అని కూలి ఇస్తున్నారు. శుక్రవారం తెల్ల వారుజామున ఆమె ఉంటున్న రేకుల షెడ్‌కు పొగలు వ్యాపించడంతో.. స్థానికులు వెళ్లి చూడగా.. రక్తపు మడుగులో సగం కాలిన స్థితిలో లక్ష్మి మృతదేహం కనిపించింది. దీంతో పోలీసులకు సమాచారమిచ్చారు. మేడ్చల్ ఏసీపీ శంకర్ రెడ్డి, సీఐ సత్యనారాయణ ఘటన స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. గొంతు, చెవులు, ముక్కు కోసి హత్య చేసిన అనంతరం.. ఆ తర్వాత కాల్చివేసినట్టు అనుమానిస్తున్నారు. క్లూస్ టీం సాయంతో ఆధారాలు సేకరించి.. మృతదేమాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సీసీ విజువల్స్ సాయంతో పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు
Also read
- నెల్లూరులో రౌడీ షీటర్లకు వెరైటీ పనిష్మెంట్.. అలా ఉంటది ఖాకీల తో పెట్టుకుంటే
- Viral News: చెప్తే అర్థం చేసుకుంటారనుకుంది.. తల్లిదండ్రులు మోసాన్ని తట్టుకోలేకపోయింది.. చివరకు..
- Andhra Pradesh: ఛీ.. ఏం మనుషులురా.. కూతురిని కూడా వదలని తండ్రి.. నెలల పాటు దారుణంగా..
- Telangana: ప్రేమన్నాడు.. వల వేసి కోరిక తీర్చుకున్నాడు.. ఆపై వెలుగులోకి అసలు ట్విస్ట్
- Guntur: ఉలిక్కిపడ్డ గుంటూరు.! పట్టపగలు ముగ్గురు మైనర్లు చేసిన పని తెలిస్తే గుండె ఆగినంత పనవుతుంది





