April 21, 2025
SGSTV NEWS
CrimeTelangana

హైదరాబాద్‌లో మరో దారుణం.. మాజాలో విషం కలిపి కూతురికి తాపించి.. ఆ తర్వాత..

హైదరాబాద్‌ పరిధిలోని ప్రగతినగర్‌లో దారుణం చోటుచేసుకుంది. నాలుగేళ్ల కూతురికి విషం ఇచ్చి తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో కూతురు మృతి చెందగా.. తల్లి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన 18వ తేదీన సాయంత్రం చోటు చేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. బాచుపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధి ప్రగతి నగర్ ఆదిత్య గార్డెన్స్ హరిత ఆర్కేడ్ అపార్ట్మెంట్స్‌లో సాంబశివ రావు, తన భార్య నంబూరి కృష్ణ పావని(32), కూతురు జశ్విక(4)లతో కలిసి నివసిస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం ఇంట్లో సాంబశివరావు లేని సమయంలో కృష్ణ పావని, తమ కూతురు జశ్వికకు మజాలో ఎలుక మందు తాగించి.. ఆ తర్వాత తాను తాగింది. శనివారం తెల్లవరుజామున కూతురికి ఎలుక మందు ఇచ్చి, తాను తాగినట్లు భర్తకు తెలపటంతో.. అతను హుటాహుటిన ఇంటికి చేరుకుని.. ఇద్దరినీ ఆసుపత్రికి తరలించాడు.


అయితే.. కూతురు జశ్విక చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందిది.. కృష్ణ పావని పరిస్థితి విషమంగా ఉంది.. ఆసుపత్రిలోని ఐసీయులో చికిత్స అందిస్తున్నారు. ప్రధానంగా ఆరోగ్య సమస్యల కారణంగానే కృష్ణ పావని, ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జశ్విక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు

Also Read

Related posts

Share via