December 18, 2024
SGSTV NEWS
CrimeTelangana

Cyber Crime: ఆ కోర్సు నేర్చుకుని.. సైబర్ క్రిమినల్స్‌గా మారుతున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, విద్యార్థులు..

ఎక్కడో విదేశాల్లో ఉన్నవారు ఇతర రాష్ట్రాల్లో ఉన్నవారు సైబర్ క్రిమినల్స్ అన్నది మనకు తెలిసిన వాస్తవం.. కానీ ఇప్పుడు మన చుట్టూ ఉండే మన బంధువుల పిల్లలు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు సైబర్ క్రిమినల్స్‌గా మారుతున్నారు.. అంటే నమ్మగలరా..? ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే నమ్మక తప్పదు. ఎందుకిలా జరుగుతుంది. ఇంతకీ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, విద్యార్దులు సైబర్ క్రిమినల్స్ గా ఎలా మారుతున్నారు.? డిటైల్డ్ గా తెలుసుకోండి.. ఈజీ మనీ కోసం వెంపర్లాడే సైబర్ నేరస్థుల సంఖ్య పెరుగుతోంది. ఎలాగైనా డబ్బు సంపాదించాలని చూస్తున్నారు. ఎథికల్ హ్యాకింగ్ కోర్సులు నేర్చుకొని సరైన మార్గంలో వెళ్లకుండా అడ్డదారిన పోతూ హ్యాకింగ్ టూల్స్ డార్క్ వెబ్ లపై అవగాహన పెంచుకొని నేరాలకు పాల్పడుతున్నారు. సైబర్ నేరగాళ్లుతో చేతులు కలిపి క్రిమినల్స్‌గా మారుతున్నారు.

ఇటీవల ఓ బీటెక్‌ విద్యార్థి ఇలాంటి మార్గాన్నే ఎంచుకున్నాడు. సైబర్ నేర గాడిగా మారిపోయి 60 లక్షలు కొట్టేశాడు. దీనికోసం OLX ను వేదికగా మార్చుకొని ఏకంగా రూ. 60 లక్షలు కాజేశాడు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు అతన్ని అరెస్ట్‌ చేశారు. తిరుపతి పట్టణానికి చెందిన ఎం. బాలాజీ నాయుడు (35) ఎస్‌వీ యూనివర్సిటీలో కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేశాడు. ఆ తర్వాత కొన్ని రోజులు పాటు ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేశాడు. అతని తీరు సరిగా లేని కారణంగా బాలాజీని ఉద్యోగం నుంచి తొలగించారు. ఆన్‌లైన్‌ గేమ్స్‌కు బానిసగా మారి అప్పులు చేశాడు. భర్త తీరు నచ్చకపోవడంతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో OLX ను వేదికగా మార్చుకొని మోసాలకు దిగడం ప్రారంభించాడు. ఇందుకోసం ముందుగా OLX లో ఖరీదైన సెకండ్‌ హ్యాండ్‌ ఫోన్‌ను సెలక్ట్‌ చేసుకునేవాడు. విక్రయిస్తానని యజమానులను సంప్రదించేవాడు. ఎలాగో ఫోన్‌ కొనుగోలు చేస్తా కదా యాప్‌ నుంచి ఫోన్‌ ఫొటో తీసేయమని యజమానితోనే తీయించేవాడు. అయితే, అంతలోపే ఫోన్‌ ఫొటోను అతడు డౌన్‌లోడ్‌ చేసుకునే వాడు. అసలు యజమాని చెప్పిన ధరకంటే తక్కువ రేటుకు ఆ ఫోన్‌ సొంతం చేసుకోవచ్చంటూ ఓఎల్‌ఎక్స్‌లో పోస్ట్‌ చేసేవాడు. ఫోన్‌ను పరిశీలించాక డబ్బులు ఇస్తానని యజమాలను తాను చెప్పిన ప్రదేశానికి రమ్మనేవాడు. ఫోన్‌ను తీసుకునేందుకు తన సోదరుడు వస్తాడని చెప్పేవాడు. అయితే, తన వద్ద ఫోన్‌ కొనేందుకు ఓకే అన్న వారికి మాత్రం తానే వస్తానని తెలిపేవాడు. ఫోన్‌ తీసుకుంటున్న వారి నుంచి ముందుగానే ఒత్తిడి చేసి యూపీఐ ద్వారా డబ్బులు పంపించుకునే వాడు. ఫోన్‌ అమ్మేందుకు వెళ్లిన వ్యక్తులు కొనేందుకు వచ్చిన వారిని డబ్బు చెల్లించమని అడిగినపుడు అసలు విషయం తెలిసేది.

తాను అప్పటికే డబ్బు చెల్లించానంటూ ఒకరు, నగదు జమకాలేదంటూ మరొకరు తెలుసుకునే లోపు బాలాజీ ఫోన్లు స్విచ్చాఫ్‌ చేసి అక్కడి నుంచి జంప్‌ అవుతాడు. బాధితుల ఫిర్యాదుతో OLX లో బాలాజీ నెంబర్‌ను బ్లాక్‌లో పెట్టింది. దీంతో ఏకంగా 23 సిమ్‌ కార్డులను మార్చాడు. ఇలా ఏపీ, తెలంగాణ, కర్ణాటక ఏకంగా 200 మందిని మోసం చేసి ఏకంగా రూ. 60 లక్షలు కాజేశాడు. ఫిర్యాదులు ఎక్కువగా కావడం, నేషనల్‌ సైబర్‌ క్రైమ్‌ పోర్టల్‌కు 138 మంది బాధితులు ఫిర్యాదు చేయడంతో సైబర్ పోలీసులు రంగంలోకి దిగారు.. ఇటీవల ఎర్రమంజిల్‌ ప్రాంతంలో బాలాజీని అరెస్ట్‌ చేశారు.


ఇప్పుడు ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో అమీర్‌పేట్ అడ్డాగా ఎథికల్ హ్యాకింగ్ నేర్పించబడును అంటూ కొత్త కొత్త సంస్థలు వస్తున్నాయి. ఎథికల్ హ్యాకింగ్ అంటే హ్యాకింగ్ టెక్నాలజీ మీద అవగాహన.. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో సైబర్ సెక్యూరిటీ గురించి తెలుసుకోవాలి.. కాబట్టి ఈ కోర్సు ద్వారా తెలుసుకొని ఉద్యోగాలు పొందుతున్నారు. కానీ, కొంతమంది అనుకున్న సమాయనికి ఉద్యోగ రాకపోవడంతో ఈజీ మనీకి అలవాటు పడుతున్నారు. సైబర్ క్రిమినల్ గా మారేందుకు ఇదొక మంచి అవకాశం అంటూ నేర్చుకున్న ఎథికల్ హ్యాకింగ్ ను అడ్డదారిలో వాడుతూ సైబర్ క్రిమినల్స్ గా మారుతున్నారు. డార్క్ వెబ్లో ఎప్పటికప్పుడు ఈ టెక్నాలజీ పై అవగాహన పెంచుకొని ఏ రకంగా మోసాలు చేయాలో తెలుసుకుని దాని సంబంధించిన టూల్స్ సంపాదించి మరి ఈ రకమైన దందా మొదలుపెట్టారు. ఇదే కాకుండా డార్క్ వెబ్ లో కొంతమంది సైబర్ నేరగాళ్లతో స్నేహం చేసి వాళ్ళ సహకారంతో ఇలా సైబర్ క్రిమినల్స్ గా మారి.. ఏమాత్రం దొరికినా అవకాశం లేకుండా చేస్తున్నారు. ఇక్కడ నేరాలు చేస్తూ క్రైమ్ ట్రాప్ చేసే విధానం మాత్రం డార్క్ వెబ్‌లో పరిచయమైన వాళ్లతో చేయిస్తూ ఎంచక్కా ఇక్కడున్న యువతే సైబర్ క్రిమినల్ గా భారీ ఎత్తున డబ్బులు సంపాదిస్తున్నారు. డార్క్ వెబ్లో కొన్ని ప్రత్యేకమైన గ్రూపులు కూడా ఉన్నాయి. ఆ గ్రూప్ మెంబర్లుగా జాయిన్ అయి ఎలా స్కామ్ చేయాలి? ఏ రకంగా ఎస్కేప్ అవ్వాలి అన్న విషయం మీద పూర్తి అవగాహన తెచ్చుకొని ఎంచక్కా డబ్బులు కొట్టేస్తున్నారు. ఒకటి కాదు రెండు కాదు కోట్లాది రూపాయల డబ్బులను కొల్లగొడుతూ సైబర్ క్రిమినల్స్ గా మారుతున్న విషయంపై ఖచ్చితంగా మనం ఆందోళనపడాల్సిన విషయమే. ఎక్కువగా హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం ప్రాంతాల్లో ఎక్కువగా చదువుకున్న యువత అడ్డదారిన సైబర్ క్రిమినల్స్ గా మారి డబ్బులు కొల్లగొట్టడమే కాకుండా ఈజీగా వచ్చిన డబ్బులతో డ్రగ్స్ లాంటి వ్యసనాలకు అలవాటు పడ్డారని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో పోలీసులు కూడా ఆశ్చర్యపడే రీతిలో మోసాలు చేస్తున్నారు. దీంతోపాటు సోషల్ మీడియాలో ఉన్న అమ్మాయిలను వేధించటం భయభ్రాంతులకు గురి చేయటం వారి మీద అత్యాచారాలు చేయడం ఫోటోలు సోషల్ మీడియాలో పెడతామని బెదిరించడం ఇవన్నీ కూడా చేస్తున్నట్టుగా ఇప్పటికే పోలీస్ దృష్టికి వచ్చింది. ఇదే కాకుండా తమకు తెలిసిన టెక్నాలజీతో నచ్చిన అమ్మాయి ఫోన్ హ్యాక్ చేసి ఆ అమ్మాయి పర్సనల్ విషయాలు తెలుసుకుని బ్లాక్ మెయిల్ చేస్తున్న ఘటనలు కూడా వెలుగు చూస్తున్నాయి.

ప్రతి కాలేజీలో ఇంటర్మీడియట్ నుంచి ఇంజనీరింగ్ వరకు సైబర్ క్రైమ్ పట్ల అవగాహన పెంపొందించాలి. ఒకవేళ ఎవరన్నా తప్పుదోవ పడితే ఎలాంటి శిక్షలు ఉంటాయి.. జీవితంలో ఏ రకమైన బాధలు ఎదుర్కొవలసి వస్తుంది.. కేసు నమోదు అయితే ఆ విద్యార్థి జీవితం ఏ రకంగా నాశనమవుతుంది అన్న అవిషయాలపై అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉంది

Also read

Related posts

Share via