హైదరాబాద్ పాతబస్తీలో ఐదు రోజులు క్రితం జరిగిన రౌడీ షీటర్ రియాజ్ హత్య కేసు తీవ్ర కలకలం రేపింది. అయితే.. అనూహ్యంగా రియాజ్ హత్యకు స్వలింగ సంపర్కమే కారణమని పోలీసుల విచారణలో వెల్లడైంది. 14 ఏళ్ల బాలుడిపై ఇటీవల రియాజ్ అండ్ కో అఘాయిత్యానికి పాల్పడినట్లు తేల్చారు. దాంతో.. రియాజ్ హత్యకు బాలుడి తల్లిదండ్రులు సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు తక్కువ సమయంలోనే కేసు ఛేదించారు.
పది బృందాలుగా విడిపోయి ఎంక్వరీ చేసిన పోలీసులు.. వందలాది సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించారు. ఈ క్రమంలోనే.. చిన్న క్లూ దొరకండంతో ఆ దిశగా దర్యాప్తు చేసి కేసును ఛేదించారు. రియాజ్ హత్యకు పాత కక్షలే కారణమని తేల్చారు. రియాజ్‌ను సలీం అండ్ సుల్తాన్ అనే గ్యాంగ్ పక్కాగా ప్లాన్ చేసి కాల్చి చంపినట్లు గుర్తించారు. హత్య కేసులో మొత్తం ఏడుగురి ప్రమేయం ఉన్నట్లు వెల్లడించారు పోలీసులు. సలీం అండ్ సుల్తాన్ గ్యాంగ్‌లో ఉన్న గౌస్ అనే బీహార్ వ్యక్తి.. తపంచతో రియాజ్‌పై మూడు రౌండ్ల కాల్పులు జరిపాడు. రియాజ్‌పై కాల్పులు జరిపి, సలీం అండ్ సుల్తాన్ గ్యాంగ్ పారిపోయింది. రియాజ్ హత్య గురించి పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేశారు.
ఎంక్వైరీలో కీలక విషయాలు తెలియగా.. ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. హమీద్ కుమారుడిపై స్వలింగ సంపర్కానికి పాల్పడడమే రియాజ్ హత్యకు దారి తీసిందని పోలీసు ఉన్నతాధికారులు వివరించారు. నెల రోజుల క్రితం గోల్కొండకు చెందిన సలీం అండ్ సుల్తాన్ గ్యాంగ్‌తో సుఫారి హత్యకు డీల్ కుదుర్చుకుని.. రియాజ్‌ను చంపేయాలని చెప్పి.. ఆ తర్వాత దుబాయ్ వెళ్లిపోయింది బాలుడి ఫ్యామిలీ. రియాజ్ కోసం సలీమ్ అండ్ సుల్తాన్ గ్యాంగ్ నెల రోజుల నుంచి ఎదురు చూసి.. అదను చిక్కడంతో హతమార్చింది
Also read
- Ganesh Chaturthi: గణేశుడికి ఏనుగు తల ఎలా వచ్చింది? గజాసురుడి తలనే ఎందుకు పెట్టారు.. అసలు కథ ఇదే!
- భాద్రపద మాసం.. వినాయక చవితి నుంచి మహాలయ అమావాస్య వరకు.. ఈ మాసంలోని పండగలివే!
- వినాయక చవితి వేళ అద్భుత గ్రహ యోగాలు.. ఈ రాశుల వారికి గణపతి ఆశీస్సులతో పట్టిందల్లా బంగారమే!
- వరాహ జయంతి సెప్టెంబర్ 13నా.. 14నా? తేదీ, శుభ సమయం, పూజా విధానం ఇదే!
- దేవుడా.. ఇలాంటి కూతురు ఎవ్వరికీ పుట్టొద్దు.. ప్రియుడి కోసం కన్నతల్లినే దారుణంగా..





