SGSTV NEWS
CrimeTelangana

Hyderabad: రెండేళ్ల బాబుకు DNA టెస్ట్ – రిపోర్ట్ చూసి షాకైన దంపతులు



సికింద్రాబాద్‌లోని టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌లో జరిగిన ఓ ఘటన ఇప్పుడు ప్రకపంనలు రేపుతోంది. వేరే వారి వీర్యకణాలతో మహిళకు గర్భధారణ జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డీఎన్‌ఏ టెస్ట్‌లో మహిళ భర్తకు పుట్టిన బాబుకు ఎలాంటి సంబంధం లేదని నిర్ధారణ కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.




మీరు పిల్లల కోసం ప్రవేట్ టెస్ట్ ట్యూబ్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారా..? వారు సంతానం పక్కా కలిగిస్తామని హామి ఇస్తున్నారా..? అయితే మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. సికింద్రాబాద్‌లోని ఓ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌ నిర్వాకం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పిల్లల లేని ఓ జంట సంతానం కోసం సదరు టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌ను ఆశ్రయించారు. తన భర్త స్పర్మ్‌తో తనకు పిల్లలు కావాలని ఆమె కోరారు. అలానే చేస్తామని వారు చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఆ దంపతులు మగబిడ్డకు జన్మనిచ్చారు.


ప్రస్తుతం బాబుకు రెండేళ్లు. అయితే పుట్టినప్పటి నుంచి చిన్నోడు తరచూ అనారోగ్యానికి గురవుతున్నాయి. ఆ టెస్ట్ ట్యూబ్ సెంటర్‌కి వెళ్తే.. పిల్లల వైద్యుల్ని సంప్రదించమని చెప్పారు. ఇటీవల ఓ ఆస్పత్రికి వెళ్లగా.. బాబు రిపోర్టులు చెక్ చేసిన డాక్టర్ DNA టెస్ట్ చేయించమని రిఫర్ చేశారు. ఆ టెస్టు రిపోర్ట్‌లో చేయించగా షాకింగ్ నిజం బయటపడింది. బాధితులు అప్రోచ్ అయిన టెస్ట్ ట్యూబ్ బేబీ వైద్యురాలు ఆమె భర్త వీర్యకణాలు కాకుండా వేరే వ్యక్తి వీర్యకణాలు ఉపయోగించి గర్భధారణ జరిపినట్లు ఆరోపణలు వస్తున్నాయి. డీఎన్‌ఏ రిపోర్ట్ ప్రకారం బాబుకు… ఆ మహిళ భర్తకు జన్యుపరమైన సంబంధమే లేదని తేలింది. ఈ నేపథ్యంలో బాధిత దంపతులు క్లినిక్ వైద్యులపై ఆగ్రహంతో నార్త్‌జోన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి కంప్లైంట్ మేరకు పోలీసులు క్లినిక్‌పై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఆ సెంటర్‌లో ఫైల్స్ అన్నీ స్వాధీనం చేసుకున్నారు. అక్కడి వైద్యులకు సరైన లైసెన్సులు ఉన్నాయా..? ఈ కేసులోనే పొరపాటున ఇలా జరిగిందా..? లేదా వారు ఇదే పద్దతిలో అందరికీ చికిత్స చేస్తున్నారా అనే విషయాలపై పోలీసులు ఫోకస్ పెట్టారు. ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌పై గతంలో కూడా కేసులు నమోదయినట్లు గుర్తించారు.

Also read

Related posts

Share this