June 29, 2024
SGSTV NEWS
Telangana

Telangana: మీటర్ రీడింగ్ తీసిన విద్యుత్ సిబ్బంది.. బిల్లు చూసి బిత్తరపోయిన సామాన్యుడు..

ఎప్పటిలాగే ఈ నెల కూడా కరెంట్‌ రీడింగ్‌ తీసుకోడానికి ట్రాన్స్‌కో సిబ్బంది వచ్చి రీడింగ్‌ తీసి బిల్లు ఇచ్చారు. ఆ బిల్లు చూసిన ఆ ఇంటి యజమానికి గుండె ఆగినంత పనైంది. గృహజ్యోతి పథకం కింద సబ్సిడీతో రూ.200లలోపు వచ్చే బిల్లు ఈసారి ఏకంగా.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

 

ఎప్పటిలాగే ఈ నెల కూడా కరెంట్‌ రీడింగ్‌ తీసుకోడానికి ట్రాన్స్‌కో సిబ్బంది వచ్చి రీడింగ్‌ తీసి బిల్లు ఇచ్చారు. ఆ బిల్లు చూసిన ఆ ఇంటి యజమానికి గుండె ఆగినంత పనైంది. గృహజ్యోతి పథకం కింద సబ్సిడీతో రూ.200లలోపు వచ్చే బిల్లు ఈసారి ఏకంగా లక్షల్లో రావడంతో ఆ వ్యక్తి లబోదిబోమన్నాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకుంది. ఆత్మకూరు మండలం రహీంఖాన్‌పేట గ్రామానికి చెందిన డి. పరశురాములు గృహజ్యోతి పథకం కింద విద్యుత్‌ బిల్లులో సబ్సిడీ పొందుతున్నాడు

 

అయితే మంగళవారం రీడింగ్‌ తీసుకోడానికి వచ్చిన ట్రాన్స్‌కో సిబ్బంది రీడింగ్‌ తీయగా ఒక్క నెలకి ఏకంగా 5,40,927 యూనిట్లు వాడినట్టు రావడంతో ఇంటి యాజమాని అవాక్కయ్యాడు. గృహజ్యోతి కింద సబ్సిడీ వస్తున్న విద్యుత్తు బిల్లు ఏకంగా రూ.6,72,642 రావడం ఏంటని ట్రాన్స్‌కో సిబ్బందిని ప్రశ్నించాడు. ఈ విషయమై ట్రాన్స్‌కో ఏఈ ప్రభాకర్‌రెడ్డిని వివరణ కోరగా.. రీడింగ్‌ తీస్తున్న సమయంలో హై ఓల్టేజ్‌ వచ్చినట్టయితే రీడింగ్‌ జంప్‌ అయ్యి పెద్ద మొత్తంలో బిల్లు వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. అధిక బిల్లు వచ్చిన మీటర్‌ను టెస్టింగ్‌ కోసం పంపినట్టు ఏఈ వివరించారు.

Related posts

Share via