ఫామ్ హౌస్‌లో పార్టీ జరుగుతోంది.. ఏదో తేడాగా కనిపించింది.. చాలామంది అబ్బాయిలు ఉన్నారు.. అమ్మాయిలు కొంతమంది మాత్రమే ఉన్నారు.. డీజేలతో రచ్చ రచ్చ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు ఎంట్రీ ఇచ్చారు.. అక్కడ సీన్ చూసి దెబ్బకు షాకయ్యారు. బయటకేమో ఫామ్ హౌస్ లోపలేమో వేర కథలా ఉంది. గంజా, మద్యం తాగుతూ.. అర్ధనగ్నంగా డ్యాన్సులు చేస్తూ రచ్చ రచ్చ చేస్తున్న ఏడుగురు అమ్మాయిలు.. 13 మంది అబ్బాయిలను అదుపులోకి తీసుకున్నారు. అసలేం జరిగిందంటే.. మొయినాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ముజ్రా పార్టీ జరుగుతుందన్న సమాచారంతో ఎస్ఓటీ పోలీసులు మంగళవారం అర్ధరాత్రి రైడ్ చేశారు. ఏడుగురు యువతులు, 13 మంది యువకులు.. మొత్తం 20 మందిని అరెస్టు చేశారు. వారి నుంచి భారీగా మద్యం, హుక్కా, గంజాను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు.
మొయినాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఏతబర్ పల్లి గ్రామ శివారులోని హాలీడే ఫార్మ్ హౌస్‌లో పుట్టినరోజు వేడుకల పేరుతో ముజ్రా పార్టీ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. పార్టీ కోసం నిర్వాహకుడు ముంబై నుంచి యువతులను హైదరాబాద్‌కు తీసుకువచ్చినట్టు పోలీసులు గుర్తించారు. ముంబైతోపాటు ఇతర రాష్ట్రాలకు చెందిన యువతులు కూడా ఉన్నట్టు పేర్కొంటున్నారు.
ఈ క్రమంలో దాడుల్లో భాగంగా.. యువతులు, యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అంతేకాకుండా నిర్వాహకుడిని సైతం పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.. ముజ్రాపార్టీలో భారీగా మద్యం, హుక్కా, గంజాయి స్వాధీనం చేసుకున్నామని.. అందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
సింగర్ రీనా అరెస్ట్..
హాలిడే ఫామ్ హౌస్‌లో అబ్దుల్ లుక్మాన్ అనే వ్యక్తి బర్త్ డే పార్టీ జరిగిందని.. ఈ ముసుగులో ముజ్రా పార్టీ నిర్వహించారని మొయినాబాద్ పోలీసులు చెబుతున్నారు. సింగర్లు రీనా, బాబు ఆధ్వర్యంలో ఈ పార్టీ జరిగినట్లు పోలీసులు తెలిపారు. రీనా అనే మహిళ కోల్‌కతా కు చెందిన మహిళ అని.. గత ఐదు సంవత్సరాలుగా నగరంలోనే ఉంటూ పార్టీలలో పాటలు పాడుతుందన్నారు. గతంలో ఇలాంటి పార్టీలలో రీనా పట్టు పడిందని మొయినాబాద్ పోలీసులు తెలిపారు.
Also read
- Malavya Rajyog 2025: వచ్చే నెలలో ఏర్పడనున్న మాలవ్య రాజయోగం.. ఈ మూడు రాశులకు మహర్దశ ప్రారంభం..
- నేటిజాతకములు …24 అక్టోబర్, 2025
- తుని ఘటన: టీడీపీ నేత నారాయణరావు మృతదేహం లభ్యం
- Telangana: అయ్యయ్యో.. ఇలా దొరికిపోతారని అనుకోలేదు.. ట్విస్ట్ మామూలుగా లేదుగా.. వీడియో వైరల్..
- పెళ్లి కోసం వచ్చిన వ్యక్తికి ఫుల్గా తాగించిన మైనర్లు.. తర్వాత ఏం చేశారో తెలిస్తే.. ఫ్యూజులెగరాల్సిందే