November 21, 2024
SGSTV NEWS
CrimeTelangana

ప్రేమ జంటలే టార్గెట్ గా పోలీస్ హోంగార్డు దారుణం! ఏం చేశాడంటే..

Hyderabad: ఎంతో మంది పోలీసులు నీతి నిజాయితీతో పని చేస్తూ..ప్రజల్లో మంచి పేరు సంపాదించుకుంటున్నారు. అయితే కొందరు చేసే చేష్టాలు, చర్యల కారణంగా డిపార్ట్ మెంట్ కి అపకీర్తి స్తుంది. లైంగివేధింపులు, లంచాలు, అసాంఘిక కార్యకలాపాలతో పోలీసు శాఖకు చెడ్డపేరు తీసుకొస్తున్నారు.


సమాజం రక్షణలో పోలీసులది కీలక పాత్ర అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రజలకు రక్షణ కల్పించడంతో పాటు సంఘ విద్రోహశక్తులను, నేరాలను అరికడుతున్నారు. అంతేకాక విధి నిర్వహణలో ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. ఇలా ఎంతో మంది పోలీసులు నీతి నిజాయితీతో పని చేస్తూ..ప్రజల్లో మంచి పేరు సంపాదించుకుంటున్నారు. అయితే కొందరు పోలీసులు, హోంగార్డులు చేసే చేష్టాలు, చర్యల కారణంగా డిపార్ట్ మెంట్ కి అపకీర్తి వస్తోంది. లైంగివేధింపులు, లంచాలు, అసాంఘిక కార్యకలాపాలతో పోలీసు శాఖకు చెడ్డపేరు తీసుకొస్తున్నారు. ఇటీవల కాలంలో చాలా మంది పోలీసులు ఇలాంటి ఘటనలకు పాల్పడి చట్టపరమైన చర్యలను ఎదుర్కొంటున్నారు. తాజాగా హైదరాబాద్ లో ఓ పోలీస్ హోంగార్డు కూడా ప్రేమ జంటలే టార్గెట్ గా దారుణాలు చేశాడు.


హైదరాబాద్‌లో ముద్దం శ్రీనివాస్ అనే వ్యక్తి హోంగార్డు విధులు నిర్వహిస్తున్నాడు.  అతడు వసూళ్ల పర్వానికి తెరలేపాడు. ప్రేమ జంటల్ని లక్ష్యంగా చేసుకొని అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నాడు. అసలు సంగతిలోకి వెళ్తే..కేబీఆర్ పార్కు చుట్టూ, జీహెచ్ఎంసీ నడకదారుల్లో వాకర్లు, సందర్శకుల భద్రత కోసం పోలీసు శాఖ సాయుధులైన పోలీసులతో ఇంటర్సెప్టార్ పెట్రోలింగ్ వాహనాలను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా హెడ్ క్వా ర్టర్స్ నుంచి వచ్చే ఇంటర్సెప్టార్ పెట్రోలింగ్ వెహికల్‌ను శ్రీనివాస్ నడిపేవాడు.

ఈ క్రమంలోనే పార్క్ చుట్టూ పెట్రోలింగ్ చేసే క్రమంలో నడదారిలో నడిచే ప్రేమజంటలు, యువతీ యువకులను టార్గెట్ గా చేసుకుని బెదిరింపులకు పాల్పడుతున్నాడు. వారి నుంచి డబ్బులను వసూళ్లు చేస్తున్నాడనే స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇటీవల రోడ్డు నెంబర్-45లోని వాక్ వేలో కొందరు యువతీ యువకులు కూర్చున్నారు. వారి వద్దకు వెళ్లిన శ్రీనివాస్.. వారిని బెదిరించాడు. అసాంఘిక కార్యకలపాలకు పాల్పడుతున్నారని.. పోలీస్ స్టేషన్‌కు రావాలంటూ వారిని బెదిరించాడు. అలా కాకుండా వారిని విడిచిపెట్టాలంటే 5 వేల రూపాయలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు.

ఇక వాక్ వేలో ప్రేమ జంటలు వచ్చే  సమాచారం తెలుసుకునేందుకు ఓ బ్రోకర్‌ను సైతం ఏర్పాటు చేసుకున్నాడు. తాజాగా కొందరు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్రీనివాస్ వసూళ్ల పర్వం బయటపడింది. ఈక్రమంలోనే బంజారాహిల్స్ పోలీసులు హోంగార్డు శ్రీనివాస్, అతడికి సహకరించిన యాదగిరి అనే బ్రోకర్ ను అరెస్టు చేశారు. ఇప్పటికే పదుల సంఖ్యలో ప్రేమ జంటలను వేధించి వారి నుంచి అక్రమంగా వసూళ్లకు పాల్పడ్డాడని తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు ఉన్నాతాధికారులు సీరియస్ అయ్యారు. ఎవరైనా సరే ఇటువంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరి.. ఇలాంటి కీచకలకు ఎలాంటి శిక్ష విధించాలి?.

Also read

Related posts

Share via