మైనర్ బాలికను ట్రాప్ చేసి.. వేరే రాష్ట్రానికి తీసుకెళ్లి.. పలుమార్లు లైంగికదాడి చేశాడు. బాలిక ఫ్యామిలీ కేసు పెట్టారని తెలియడంతో.. ఆమెను తీసుకువచ్చి.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వదిలేసి పారిపోయాడు. రెండేళ్లుగా పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నాడు. తాజాగా నిందితుడ్ని బాలాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు.
బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉండే 11 ఏళ్ల బాలిక లోకల్‌గా ఉండే ఓ ప్రైవేట్ స్కూల్లో ఐదవ తరగతి చదవుతుంది. అదే ప్రాంతంలో ఉండే 21 ఏళ్ల రాబిన్ బాలికకు మాయమాటలు చెప్పి ట్రాప్ చేశాడు. సెలవుల్లో వివిధ ప్రాంతాలకు తిరిగి ఎంజాయ్ చేద్దామన్నాడు. పక్కాగా ప్లాన్ చేసి.. 2023 మే 23న ఇంట్లో నుంచి డబ్బు తీసుకురావాలని బాలికకు సూచించాడు. అతడి మాయలో పడ్డ బాలిక ఇంట్లో నుంచి రూ.30 వేలు తీసుకొచ్చింది. దీంతో బాలికను తీసుకొని ఏపీలోని వైజాగ్‌తో పాటు ఒడిశాకు తీసుకెళ్లాడు. ఆయా ప్రాంతాల్లో బాలికపై పలుమార్లు లైంగికదాడి చేశాడు.
పాప ఆచూకి తెలియకపోవడంతో బాలిక కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. దీంతో భయపడ్డ రాబిన్, అదే నెల 29వ తేదీన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో బాలికను వదిలేసి వెళ్లాడు. వాటర్ బాటిల్ తీసుకొస్తానని చెప్పి వెళ్లి మళ్లీ వెనక్కి రాలేదు. ఆ బాలిక ఓ వ్యక్తి ఫోన్ అడిగి తల్లిదండ్రులకు కాల్ చేసింది. ఇంటికి తీసుకెళ్లగా జరిగింది చెప్పింది. దీంతో మిస్సింగ్ కేసు కాస్తా పోక్సో కేసుగా టర్న్ అయింది. అప్పటి నుంచి రాబిన్ పోలీసులకు చిక్కకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. అతడి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులను ప్రశ్నించినా వివరాలు తెలియరాలేదు.
కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. నిందితుడి కదలికలపై ఫోకస్ పెట్టారు. ఇటీవల నిందితుడి నానమ్మ ఆరోగ్యం బాగోకపోవడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. రాబిన్‌కి నానమ్మ అంటే ప్రేమ ఉండటంతో .. అతడు ఆస్పత్రికి వస్తాడని పోలీసులు భావించారు. మూడు రోజుల పాటు అక్కడే కాపుకాసారు. పోలీసులు అనుకున్నట్లుగానే నిందితుడు ఆస్పత్రికి రావడంతో అదుపులోకి తీసుకున్నారు
Also read
- Auspicious Yogas: ఈ నెల 21న అరుదైన యోగాలు.. దీర్ఘాయువు, ఆయుస్సు కోసం ఎలా పుజించాలంటే..
- Brahma Muhurta: బ్రహ్మ ముహూర్తంలో మేల్కొంటే ఎన్ని లాభాలో తెలుసా . . ఏ పనులను శుభప్రదం అంటే..?
- నేటి జాతకములు..19 జూలై, 2025
- Visakhapatnam Kidney Racket: అందమైన సాగరతీరంలో కిడ్నీ రాకెట్ కలకలం..! విచారణలో విస్తుబోయే వాస్తవాలు..
- Andhra News: ఉద్యోగం వదిలి వచ్చి పెళ్లైన వ్యక్తితో కూతురు ప్రేమాయణం.. తల్లిదండ్రులు ఏం చేశారంటే!