SGSTV NEWS
CrimeTelangana

Hyderabad: మహిళను చంపింది అతనే.. నిందితుడిని పట్టించిన కండోమ్.. మేడ్చల్‌ ఘటనలో సంచలన విషయాలు..



హైదరాబాద్‌లో వరుస హత్యలు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు నగరవాసులను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. అయితే.. మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లో ఓ వివాహిత దారుణ హత్యకు గురవ్వడం కలకలం రేపిన విషయం తెలిసిందే.. బండరాళ్లతో మోదీ.. ఆపై పెట్రోల్‌ పోసి మహిళ మృతదేహాన్ని తగలబెట్టడం సంచలనంగా మారింది.


హైదరాబాద్‌లో వరుస హత్యలు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు నగరవాసులను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. అయితే.. మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లో ఓ వివాహిత దారుణ హత్యకు గురవ్వడం కలకలం రేపిన విషయం తెలిసిందే.. బండరాళ్లతో మోదీ.. ఆపై పెట్రోల్‌ పోసి మహిళ మృతదేహాన్ని తగలబెట్టడం సంచలనంగా మారింది.. అయితే.. మేడ్చల్‌లో మహిళ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.. మహిళను హత్య చేసిన నిందితుడిని కండోమ్‌ పట్టించింది. మేడ్చల్‌ డీసీపీ కోఠిరెడ్డి సోమవారం మహిళ హత్య కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. డబ్బు విషయంలో జరిగిన గొడవ హత్యకు దారి తీసిందని.. నిందితుడిని కండోమ్ పట్టించిందని తెలిపారు..


అసలేం జరిగిందంటే..
నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ సమీపంలోని సెట్టిపేట్‌కు చెందిన 45 ఏళ్ల మహిళ.. భర్తతో విభేదాలతో హైదరాబాద్ నగరానికి వచ్చింది.. కుషాయిగూడలో ఉంటూ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తుంది. అయితే.. మహిళ ఈ నెల 24న పని కోసం మేడ్చల్‌ బస్టాప్‌ దగ్గరికి వచ్చింది. శామీర్‌పేట మజీద్‌పూర్‌లో ఉండే షేక్‌ ఇమామ్‌ (37) ఆమెతో మాటలు కలిపాడు.. ఈ సమయంలోనే.. ఏకాంతంగా గడిపేందుకు రావాలని.. అలా వస్తే రూ.500 ఇస్తానంటూ మహిళను ఒప్పించాడు.

ఆ తర్వాత ఇమామ్ సదరు మహిళ ఇద్దరూ కలిసి మునీరాబాద్‌లోని ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లారు. అక్కడకు వెళ్లిన తర్వాత మహిళ ఎక్కువ డబ్బులు అడగడంతో ఇమామ్‌ ఆగ్రహంతో ఆమెతో గొడవపడ్డాడు.. ఆ తర్వాత ఆమె గొంతు నులిమి రాయితో కొట్టి మహిళను చంపేశాడు. అనంతరం ఆమె మృతదేహంపై పెట్రోలు పోసి నిప్పంటించి పారిపోయాడు.


ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు .. ముమ్మరంగా దర్యాప్తు చేశారు.. మృతురాలి ఫోన్‌ నెంబర్ ఆధారంగా హత్యకు ముందు ఆమె ఎక్కడుంది..? ఆమె వెంట ఎవరున్నారని ఆరా తీసినప్పుడు.. మహిళ మునీరాబాద్‌ సమీపంలో తిరిగినట్లు గుర్తించారు.

అనంతరం గ్రామంలోని పలు ప్రాంతాల్లో ఉన్న సీసీ పుటేజ్‌లు పరిశీలించగా ఓ మెడికల్‌ షాపు దగ్గర మహిళ, మరో వ్యక్తి కనిపించారు. అక్కడ వారు కండోమ్‌లు కొన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే.. అక్కడ చేసిన డిజిటల్‌ చెల్లింపుల ఆధారంగా నిందితుడి ఫోన్‌ నెంబర్‌ను గుర్తించి.. ఇమామ్‌ అనే వ్యక్తిదేనని నిర్ధారించుకున్నారు.. ఆదివారం నిందితుడిని అదుపులోకి తీసుకుని.. సోమవారం కోర్టులో హాజరుపర్చారు.. అనంతరం నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు

Also read

Related posts

Share this