July 3, 2024
SGSTV NEWS
Telangana

లిక్కర్ స్కాం‌లో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్.. ఢిల్లీకి తరలిస్తున్న ఈడీ అధికారులు..

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. కొన్నిగంటల పాటు కవిత నివాసంలో సోదాలు చేపట్టిన ఈడీ, ఐటీ అధికారులు.. ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. కొన్నిగంటల పాటు కవిత నివాసంలో సోదాలు చేపట్టిన ఈడీ, ఐటీ అధికారులు.. ఆమెను అదుపులోకి తీసుకున్నారు. కవితను అరెస్ట్ చేయడానికి ముందు కేటీఆర్, హరీశ్ రావు ఆమె నివాసానికి వెళ్లారు. కవితను ఏ ప్రాతిపదికన అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలని కేటీఆర్ అధికారులను ప్రశ్నించారు.



మధ్యాహ్నం నుంచి కవిత నివాసం దగ్గర హైడ్రామా నడిచింది. ఆమె ఇంట్లో సోదాల కోసం 10 మంది ఈడీ, ఐటీ అధికారుల కవిత ఇంటికి చేరుకున్నారు. ఈడీ జాయింట్‌ డైరెక్టర్‌ నేతృత్వంలో సోదాలు నిర్వహించారు. ఈడీ సోదాలపై కవిత లాయర్ సోమా భరత్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు ఎలాంటి చర్యలు ఉండవన్న ఈడీ.. సోదాలు చేయడం సరికాదన్నారు. కోర్టులో కేసు ఉండగా సడెన్‌గా ఎందుకీ సోదాలని ఆయన ప్రశ్నించారు.

ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో ఈడీ జారీ చేసిన సమన్లను సుప్రీంకోర్టులో సవాల్ చేశారు MLC కవిత. ఈ పిటిషన్‌ను ఇవాళ విచారించిన సుప్రీంకోర్టు ఈ నెల 19కి వాయిదా వేసింది. సీఆర్పీసీ నిబంధనల ప్రకారం విచారణ జరపడం లేదని కవిత ఆరోపించారు. మహిళలను ఈడీ కార్యాలయానికి పిలిచి ప్రశ్నించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తనపై ఎలాంటి బలవంతపు చర్యలను ఈడీ తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో కవిత కోరారు.

ఢిల్లీ లిక్కర్‌ కేసు సంచలన రేపుతోంది. శుక్రవారం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఈడీ అధికారులు ఎమ్మెల్సీ కవిత ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో భాగంగా కవితతో పాటు ఆమె భర్త సెల్‌ఫోన్లు సైతం ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు కవితను అరెస్టు చేశారు. దీంతో కేటీఆర్‌, హరీష్‌రావు తదితర నేతలు కవిత ఇంటికి చేరుకున్నారు. టీఆర్‌ఎస్‌ శ్రేణులు సైతం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ ఈడీ అధికారులతో వాగ్వివాదానికి దిగారు. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్టు చేస్తారంటూ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ను కేటీఆర్‌ ప్రశ్నించారు.

అరెస్టు చేయమంటూ సుప్రీంకోర్టుకు మాట ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు లో చెప్పిన మాటను తప్పుతున్న మీ అధికారులు కోర్టు ద్వారా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించిన కేటీఆర్

కావాలని శుక్రవారం వచ్చారు ఢిల్లీ నుంచి ఈడీ అధికారులు కావాలని శుక్రవారం హైదరాబాద్‌కు వచ్చారని కేటీఆర్‌ ఆరోపించారు. సోదాలు ముగిసిన తర్వాత కూడా ఇంట్లోకి రావద్దు అంటూ హుకుం జారీ చేస్తున్న ఐడి అధికారులపై ఆయన మండిపడ్డారు. ఈరోజు మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచేందుకు అవకాశం లేదంటూనే… అరెస్టు అని చెప్పడం పైన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

Also read

Related posts

Share via