వీడ్ని ఏమనాలో మీరే చెప్పండి.. కనీసం సభ్యత లేకుండా ప్రవర్తించాడు. నలుగురూ వచ్చి పోయే ప్రదేశం అన్న సోయి కూడా లేదు. ఇలాంటి వారికి సరైనా పనిష్మెంట్ ఇస్తేనే.. ఆకతాయులకు బుద్ది వస్తుంది. ఇంతకీ వాడు ఏం చేశాడు అనుకుంటున్నారా..? పదండి ఆ విషయం తెలుసుకుందాం…
మద్యం మత్తు బాగా తలకెక్కిందో.. స్వతహాగా ఉన్న పైత్యం పరాకాష్టకు చేరిందో తెలియదు కానీ.. ఓ వ్యక్తి ఏటీఎం సెంటర్‌లో మూత్ర విసర్జన చేశాడు. తొలుత ఏటీఎం సెంటర్‌లో డబ్బులు డ్రా చేసి.. ఆపై అక్కడే యూరిన్ పాస్ చేశాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజ్ భవన్ రోడ్డులో RBL బ్యాంక్ ఏటీఏం ఉంది. మార్చి 10వ తేదీన అందులో నగదు డ్రా చేసుకునేందుకు ఓ వ్యక్తి వచ్చాడు. డ్రా చేసిన అనంతరం.. మనీ బయటకు వచ్చే ప్రాంతం వద్ద మూత్ర విసర్జన చేశాడు. దీంతో సెన్సార్ పని చేయకుండా పోయింది.
తనీఖీల్లో భాగంగా ఇటీవల ఏటీఏం వద్దకు వచ్చిన RBL బ్యాంక్ ఆపరేసన్స్ మేనేజర్ రవికుమార్.. అక్కడి సెన్సార్ పని చేయడం గుర్తించాడు. దీంతో అనుమానం వచ్చి సీసీ కెమెరా చెక్ చేయగా.. ఓ వ్యక్తి కావాలనే అక్కడ మూత్ర విసర్జన చేసినట్లు నిర్ధారించుకున్నాడు. దీంతో వెంటనే విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Also Read
- నేటి జాతకములు..19 జూలై, 2025
- Visakhapatnam Kidney Racket: అందమైన సాగరతీరంలో కిడ్నీ రాకెట్ కలకలం..! విచారణలో విస్తుబోయే వాస్తవాలు..
- Andhra News: ఉద్యోగం వదిలి వచ్చి పెళ్లైన వ్యక్తితో కూతురు ప్రేమాయణం.. తల్లిదండ్రులు ఏం చేశారంటే!
- Andhra: వానకాలంలో వడదెబ్బ.. 8 మంది విద్యార్థినులకు అస్వస్థత
- Crime: సీసీటీవీ ఫుటేజీలో అడ్డంగా బుక్కయ్యాడు… మల్లన్నకే మస్కా కొట్టాలని చూసిన ఆలయ ఉద్యోగి