February 24, 2025
SGSTV NEWS
CrimeTelangana

Hyderabad: ఛీ.. ఛీ.. ఇదా కొనుక్కోని తినేది.. యాక్.. వీడియో చూశారంటే ఇక ముట్టుకోరు..



కల్తీకి కాదేదీ అనర్హం అన్నట్టు రెచ్చిపోతున్నారు కల్తీగాళ్లు.. ప్రతిదీ కల్తీ చేసి.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.. కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌తో జేబులు నింపుకుంటున్న కేటుగాళ్ల గుట్టు రట్టవుతున్నా.. ఏమాత్రం తగ్గకుండా అదే దందాను కొనసాగిస్తున్నారు.. ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేస్తున్నా.. ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు..


కల్తీకి కాదేదీ అనర్హం అన్నట్టు రెచ్చిపోతున్నారు కల్తీగాళ్లు.. ప్రతిదీ కల్తీ చేసి.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.. కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌తో జేబులు నింపుకుంటున్న కేటుగాళ్ల గుట్టు రట్టవుతున్నా.. ఏమాత్రం తగ్గకుండా అదే దందాను కొనసాగిస్తున్నారు.. ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేస్తున్నా.. ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు.. తాజాగా.. అల్లం వెల్లుల్లి పేస్ట్‌ తయారీలో దారుణాలు వెలుగు చూశాయి.. హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్‌లో ఎలాంటి ప్రమాణాలు పాటించకుండా.. కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ తయారీ చేస్తున్న ముఠా బాగోతం బట్టబయలైంది..

వీడియో చూడండి..




కాళ్లకు షూలు ధరించి తొక్కుతూ అల్లంపేస్ట్‌ తయారీ చేస్తున్నారు కేటుగాళ్లు.. ఎలాంటి ప్రమాణాలు పాటించకుండా విచ్చలవిడిగా తయారు చేస్తున్నారు. షూతో అల్లం, వెల్లుల్లిని అలానే తొక్కుతూ.. మిగిలిన పొట్టు, చెత్తను నాలాలోకి వదలిస్తున్నారు తయారీదారులు..దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.



తీవ్ర దుర్వాసనల మధ్యే అల్లం వెల్లుల్లి పేస్టును తయారీ చేసి మార్కెట్ లోకి వదలుతున్నారు. గతంలో ఈ విషయంపై స్థానికులు ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు పేర్కొంటున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా అల్లంపేస్టు తయారు చేస్తున్న ముఠాపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు

Also read

Related posts

Share via