హైదరాబాద్ పాతబస్తీలో దారుణం చోటుచేసుకుంది.. ఓ లారీ డ్రైవర్ బైకర్ ను ఢీకొట్టి దాదాపు రెండు కిలో మీటర్లపాటు ఈడ్చుకెళ్లాడు.. లారీ బీభత్సం సృష్టించిన ఘటన హైదరాబాద్ లోని చంపా పేట ప్రధాన రోడ్డుపై చోటుచేసుకుంది. లారీ బైక్‌ను ఢీకొట్టి రెండు కిలో మీటర్లపాటు ఈడ్చుకుంటూ వెళ్లింది. అనంతరం మరో కార్‌ను ఢీకొట్టింది. అయితే, ద్విచక్రవాహనదారుడి ఫిర్యాదు మేరకు సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి లారీ డ్రైవర్ ను అరెస్టు చేశారు. వివరాల ప్రకారం.. ఈదీ బజార్‌కు చెందిన వ్యాపారి అబ్దుల్ మజీద్ (60 ) అర్ధరాత్రి తన టూ వీలర్ పై చంపాపేట్ లక్ష్మీ గార్డెన్ దగ్గర వెళుతుండగా వెనుకవైపు నుంచి వచ్చిన లారీ (AP 39VC 976) అకస్మాత్తుగా ఢికొట్టింది. అయితే, బైక్ లారీ కిందకు వెళ్లగా.. బైకర్ మాత్రం తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు.. లారీ డోర్ పట్టుకుని.. కొంత దూరం వరకు అలానే వెళ్లిపోయాడు.. ఫుట్‌బోర్డ్ పై ఉండటంతో అతనికి ఎటువంటి గాయాలు కాలేదు. ఈ ఘటనలో ద్విచక్ర వాహనం పూర్తిగా దెబ్బతింది. అనంతరం చంపాపేట్ టి-జంక్షన్ వద్ద అదే లారీ (టిఎస్ 07యుఎన్ 2580) గల మరో కారును కూడా ఢీకొట్టి ధ్వంసం చేసి ఆగకుండా వెళ్లి పోయింది.
అయితే, బైకర్ రెండు కిలోమీటర్ల పాటు లారీ ఫుట్‌బోర్డ్ దగ్గర నిలబడి ఆపాలంటూ అర్తనాదాలు చేశాడు. ఈ క్రమంలో రోడ్డుకు అడ్డంగా మరో వాహనం రావడంతో లారీ డ్రైవర్ బ్రేకులు వేయగా అప్పుడు కిందకు దిగాడు.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని రెండు కిలోమీటర్ల పాటు ఫుట్‌బోర్డ్ పై బైకర్ నిలబడ్డాడు. ఈ సమయంలో లారీని పట్టుకుని బైకర్ వెళ్తుండగా.. అటుగా వస్తున్న కారు డ్రైవర్.. ఈ వీడియోను రికార్డు చేశాడు. దీంతో ఈ వీడియో వైరల్ అయ్యింది.
వీడియో చూడండి..
అయితే, వీడియో ఆధారంగా లారీ డ్రైవర్ ని పట్టుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. లారీని కూడా సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
Also read
- ‘నేను చచ్చిపోయినా బాగుండేది’.. అమీన్పూర్ ముగ్గురు పిల్లల తండ్రి ఆవేదన!
- హెల్త్ సూపర్వైజర్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. సుపారీ ఇచ్చి మరీ భార్య దారుణంగా!
- Lady Aghori-Sri Varshini: అఘోరీ ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్.. వర్షిణిని రప్పా రప్పా ఈడ్చుకెళ్లిన ఫ్యామిలీ
- ప్రయాణిస్తున్న రైలు వాష్‌రూమ్‌లో వేధింపులు.. వీడియోలు రికార్డింగ్
- ఏపీ సచివాలయంలో అగ్నిప్రమాదం..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలోని రెండవ బ్లాక్‌లో