March 11, 2025
SGSTV NEWS
CrimeTelangana

Hyderabad: అందరూ దేవుడ్ని మొక్కేందుకు గుడికొస్తే.. ఈ మహిళలు చేసిన పని చూస్తే..



అందరూ గుడికి దేవుడ్ని మొక్కేందుకు వెళ్తారు. కానీ వీరు మాత్రం చేసే పనులివి.. ఎంచక్కా భక్తుల మాదిరిగా గుడిలోకి ఎంట్రీ ఇచ్చారు. తర్వాత చేయాల్సిన పని చేసి.. గప్పుచుప్పుగా వెళ్లిపోయారు. ఇంతకీ వాళ్లు చేసిన పని ఏంటి.? ఆ వివరాలు ఇలా..


ఆలయాలలో దేవుళ్ళకు కూడా భద్రత లేకుండా పోతుంది. గతంలో రాత్రి సమయాల్లో ఇండ్లలోనే ఎక్కువగా దొంగతనాలు జరిగేవి. రానురానూ దేవాలయాలను కూడా దొంగలు టార్గెట్ చేశారు. దేవాలయాల్లో దొంగతనాలు అయితే అర్థరాత్రి సమయంలో ఒకటికి రెండు సార్లు చెక్ చేసిన అనంతరం గుడిలో ఎవ్వరు లేరని నిర్ధారించుకున్నాక దొంగలు చోరీలు చేసేవారు. కానీ ఇప్పుడు గుడిలో అందరూ ఉండగానే ఒకవైపు పూజలు జరుగుతుండగానే దొంగలు దేవుళ్ళకు శఠగోపం పెట్టారు.


హైదరాబాద్‌లోని ఎస్ఆర్‌ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఎస్ఆర్ నగర్ సమీపంలోని గురుమూర్తి నాగర్‌లోని శ్రీ వినాయక దేవాలయం ఉంది. అర్చకుడు నవీన్ కుమార్ శనివారం ఉదయం ఆలయానికి వచ్చి పూజలు చేసేందుకు శివాలయ గర్భగుడి తలుపులు తెరిచాడు. రోజూ మాదిరిగానే పూజలు చేస్తూ వచ్చిన భక్తులకు అర్చనలు చేస్తూ గర్భగుడిలో భక్తుల చేత అభిషేకాలు చేయిస్తున్నాడు. ఉదయం 10 గంటల సమయంలో టిఫిన్ చేయడానికి వెళ్లి వచ్చిన పూజారికి శివాలయం గర్భగుడిలో ఉన్న పంచలోహ విగ్రహాలు కనిపించలేదు. దీంతో కంగారుపడ్డ పూజారి.. ఆలయ ఈఓ నరేందర్ రెడ్డికి సమాచారం అందించాడు. శనివారం రాత్రి ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.


ఆలయం లోపల ఉన్న శివ పార్వతుల పంచలోహ విగ్రహాలు చోరికి గురికావడంతో పోలీసులు పరిసర ప్రాంతాల్లోని సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. గర్భ గుడిలోని శివ పార్వతుల పంచలోహ విగ్రహాలను మహిళలు చోరీ చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భక్తుల వేషంలో ఇద్దరు మహిళలు గర్భ గుడిలోకి వచ్చినట్లు వేరే విగ్రహాలు తీసుకెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గర్భగుడిలోని వచ్చిన మహిళలలో ఒక మహిళ బయటకు వచ్చి తీర్థ ప్రసాదాలు ఇస్తున్న పూజారిని మాటల్లో పెట్టింది. లోపల ఉన్న మహిళ రెండు సుమారు 9 కిలోల పంచలోహ విగ్రహలను సంచిలో వేసుకునే వెళ్లినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్సార్ నగర్ పోలీసులు.

Also read

Related posts

Share via