SGSTV NEWS online
Telangana

Jubilee Hills by election: కౌంటింగ్‌కు ముందు గుండెపోటుతో మృతి.. ఈయనకు ఎన్ని ఓట్లు పడ్డాయంటే..?

 


జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించింది. ఎవరి అంచనాకు అందని విధంగా కాంగ్రెస్ దూసుకుపోయింది. తొలి రౌండ్‌ నుంచే మెజార్టీ సాధించి.. రౌండ్ రౌండ్‌కు తన ఆధిక్యతను పెంచుకుంటూ పోయింది. ఏ రౌండ్‌లోనూ హస్తం హవాను కారు పార్టీ అడ్డుకోలేకపోయింది. 24 వేల ఓట్లకు పైగా మెజార్టీతో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. జూబ్లీహిల్స్‌ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా అని గెలుపు అనంతరం నవీన్ యాదవ్ మీడియాతో చెప్పారు. నవీన్ యాదవ్‌కు 98988 ఓట్లు పోలవ్వగా.. సమీప ప్రత్యర్థి మాగంటి సునీతకు 74259 ఓట్లు పోలయ్యాయి. 24729 ఓట్ల మెజార్టీతో నవీన్ యాదవ్ విజయం సాధించారు.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీ చేసిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) అభ్యర్థి మహ్మద్ అన్వర్ కౌంటింగ్ ప్రారంభానికి ముందే గుండెపోటుతో మరణించారు. వ్యాపారం చేసే 40 ఏళ్ల అన్వర్ ఈ ఉప ఎన్నికలో 24 ఓట్లు సాధించాడు. ఆయన పోల్ ఫలితాల కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నప్పుడు ఛాతీ నొప్పిగా ఉందని ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అన్వర్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడికి చేరుకునేలోపే ఆయన మరణించినట్లు  వైద్యులు ధృవీకరించారు. అతను తన కుటుంబంతో కలిసి లాల్ నగర్‌లోని ఎర్రగడ్డలో నివసించేవాడని తెలిసింది

Also Read

Related posts