హైదరాబాద్ శివారులో ఓ మహిళ దారుణ హత్య సంచలనం రేపింది. నో డౌట్.. నగల కోసమే దాడి చేశారు.. చంపేశారు.. మూడు రోజుల దర్యాప్తు తర్వాత పోలీసులు కూడా అదే తేల్చారు. ఇంతకీ ఎవరా హంతకుడు? హత్య కేసును పోలీసులు ఎలా ఛేదించారు?
మేడ్చల్ శివారు అత్వెల్లి గ్రామంలో ఒంటరి మహిళ హత్య కేసును ఛేదించారు పోలీసులు. చెవిదిద్దుల కోసమే ఓ యువకుడు కిరాతకానికి ఒడిగట్టినట్టు తేల్చారు.
సగానికి పైగా కాలిన మహిళ మృతదేహం
మూడు రోజుల క్రితం అత్వల్లిలోని ఓ రేకుల షెడ్ నుంచి మంటలు రావడం గమనించిన స్థానికులు మేడ్చల్ పోలీసులకు సమాచారమిచ్చారు. స్పాట్‌కు చేరుకున్న పోలీసులు మంటలను ఆర్పేశారు. కానీ అప్పటికే మహిళ మృతదేహం సగానికి పైగా కాలిపోయింది. మృతురాలు వికారాబాద్‌కు చెందిన లక్ష్మీగా గుర్తించారు. లక్ష్మీ ఓ వైన్ షాప్‌లో రోజువారి కూలీగా పనిచేసేది. ఏం జరిగిందో తెలియదు.. సడెన్‌గా హత్యకు గురయింది.
ఒంటిపై నగలను గమనించిన రాకేష్
కూలి పనులు చేసే రాకేష్.. తల్లితో కలిసి దిల్‌షుఖ్‌నగర్‌లో ఉంటున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. ఈ క్రమంలోనే కిష్టాపూర్‌లో మద్యం తాగుతున్న సమయంలో లక్ష్మీ కంటపడింది. ఒంటిపై నగలు ఉండటంతో ఎలాగైనా వాటిని కొట్టేయాలని ప్లానేశాడు. ఆమెకు బాగా మద్యం తాగించాడు. నిద్రలోకి జారుకుందని భావించి.. నగలు తీసుకునే ప్రయత్నం చేశాడు. అయితే లక్ష్మీ ప్రతిఘటించడంతో గొంతుకోశాడు. ముక్కు చెవి భాగాలను కత్తిరించి బంగారంతో ఉడాయించాడు. వెళ్తూ వెళ్తూ డెడ్‌బాడీకి నిప్పుంటించాడు.
మర్డర్ మిస్టరీని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజ్ తిరగేసి నిందితుడ్ని అరెస్ట్ చేశారు. ఐదు గ్రాముల ముక్కుపుడకలు, 60గ్రాముల వెండి కడియాలు, బ్రాస్‌లెట్, ఉంగరంతో పాటు 3,500 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. గుర్తుతెలియని వ్యక్తుల్ని ఎవరూ నమ్మొద్దని.. అనుమానం వస్తే తమకు సమాచారం ఇవ్వాలన్నారు పోలీసులు
Also read
- Auspicious Yogas: ఈ నెల 21న అరుదైన యోగాలు.. దీర్ఘాయువు, ఆయుస్సు కోసం ఎలా పుజించాలంటే..
- Brahma Muhurta: బ్రహ్మ ముహూర్తంలో మేల్కొంటే ఎన్ని లాభాలో తెలుసా . . ఏ పనులను శుభప్రదం అంటే..?
- నేటి జాతకములు..19 జూలై, 2025
- Visakhapatnam Kidney Racket: అందమైన సాగరతీరంలో కిడ్నీ రాకెట్ కలకలం..! విచారణలో విస్తుబోయే వాస్తవాలు..
- Andhra News: ఉద్యోగం వదిలి వచ్చి పెళ్లైన వ్యక్తితో కూతురు ప్రేమాయణం.. తల్లిదండ్రులు ఏం చేశారంటే!