February 3, 2025
SGSTV NEWS
CrimeTelangana

Hyderabad: గచ్చిబౌలిలో కాల్పుల కలకలం.. ఏం జరిగిందంటే..



హైదరాబాద్ గచ్చిబౌలిలో కాల్పుల కలకలం రేగింది. పోలీసులపై దొంగ రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. కానిస్టేబుల్ సహా బౌన్సర్‌కు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ కాల్పుల ఘటనతో స్థానికంగా ఒక్కసారిగా అలజడి చెలరేగింది. ఏం జరిగిందో అర్థం కాక జనాలు పరుగులు తీశారు.


హైదరాబాద్‌ గచ్చిబౌలిలో కాల్పుల కలకలం.  ఓ పబ్‌లో దొంగను పట్టుకునే క్రమంలో ఈ ఘటన జరిగింది. కాల్పులు జరిపినా పోలీసులు సాహసం చేసి దొంగను అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీస్ ఉన్నతాధికారులు ఘటనపై ఆరా తీశారు. సైబరాబాద్‌ సీసీఎస్‌ కానిస్టేబుల్ వెంకట్ రెడ్డి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కానిస్టేబుల్‌తో పాటు పబ్‌లో ఉన్న బౌన్సర్‌కు కూడా గాయాలయ్యాయి. అయితే దొంగ కాల్పులు జరిపిన దొంగ మోస్ట్‌వాంటెడ్‌ క్రిమినల్‌ ప్రభాకర్‌గా చెబుతున్నారు. ఆపై దుండుగుడ్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అతనిపై ఎన్ని కేసులు ఉన్నాయి. ఎంత కాలం నుంచి పరారీలో ఉన్నాడు. అసలు ఎందుకు కాల్పులు జరిపాడు. అతనికి గన్ ఎక్కడిది.? అనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.


ఈ ఘటనతో పబ్ లోపల, బయట టెన్షన్ వాతావరణం నెలకొంది. ఒక్కసారిగా కాల్పుల శబ్ధంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. దొంగ కాల్పులు జరుపుతున్న సమయంలో ఏం జరుగుతుందో అర్ధంకాక గందరగోళానికి గురయ్యారు. పోలీసులు, దొంగలను చూసి ఒక్కసారిగా హడలిపోయారు

Also read

Related posts

Share via