అతను ఆటో డ్రైవర్.. ఇష్టంగా ఆమెను పెళ్లి చేసుకున్నాడు.. అయితే.. చిన్నపాటి గొడవలకే తట్టుకోలేకపోయాడు… కోపంతో భార్యపై రగిలిపోయాడు.. రాత్రి భార్యాభర్తల మధ్య మళ్లీ గొడవైంది.. కోపంతో ఆమెపై చేయిచేసుకున్నాడు.. ఆ తర్వాత ఆమె గొంతు కోసి..
అతను ఆటో డ్రైవర్.. ఇష్టంగా ఆమెను పెళ్లి చేసుకున్నాడు.. అయితే.. చిన్నపాటి గొడవలకే తట్టుకోలేకపోయాడు… కోపంతో భార్యపై రగిలిపోయాడు.. రాత్రి భార్యాభర్తల మధ్య మళ్లీ గొడవైంది.. కోపంతో ఆమెపై చేయిచేసుకున్నాడు.. ఆ తర్వాత ఆమె గొంతు కోసి చంపాడు.. చివరకు ఆమె మృతదేహాన్ని ఇంట్లోనే తగులబెట్టాడు.. ఈ షాకింగ్ ఘటన హైదరాబాద్ లోని పాత బస్తీలో చోటుచేసుకుంది.. కట్టుకున్న భార్యను అతి కిరాతకంగా చంపిన ఘటన పాతబస్తీ బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని హస్మాబాద్ ఖాద్రియా మసీదు ప్రాంతంలో చోటుచేసుకుంది.. భార్య గొంతు కోసి ఆ తర్వాత తగులబెట్టాడు ఆటో డ్రైవర్..
స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బండ్లగూడలో నివాసం ఉంటున్న ఫైజ్ ఖురేషి(28) వృత్తిరీత్యా ఆటో డ్రైవర్.. పిసల్ బండకు చెందిన ఖమర్ బేగం అనే యువతితో ఆరేళ్ల క్రితం పెళ్లి జరిగింది. అయితే.. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అందరి జీవితం లాగే వీరి సంసారంలో కూడా చిన్న చిన్న గొడవలు వస్తూ ఉండేవి.. ఇరువురు కుటుంబసభ్యులు ఇద్దరిని సముదాయించి చెప్పేవారు..
ఈ క్రమంలో గత సోమవారం అర్ధరాత్రి కూడా దంపతుల మధ్య ఓ చిన్నపాటి గొడవ వచ్చింది. ఏదో విషయమై ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. దీంతో భర్త ఖురేషి తీవ్రస్థాయిలో కోపోద్రిక్తుడయ్యాడు.. భార్య ఖమర్ పై కత్తితో దాడి చేసి ఆమె గొంతు కోశాడు. అంతటితో ఆగకుండా ఆమె మృతదేహాన్ని తగులబెట్టాడు.
ఇంతటి దారుణానికి పాల్పడిన అనంతరం ఖురేషి పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయడు. ఘటనా స్థలికి వెళ్లిన పోలీసులు మంటల్లో కాలిపోయిన ఖమర్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని బండ్లగూడ పోలీసులు తెలిపారు
Also read
- AP Crime: ఏపీలో మరో పరువు హత్య.. మైనర్ బాలికను చంపేసిన పేరెంట్స్!?
- సర్కార్ గట్టుకు మరమ్మతులు చేపట్టిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ళ రాము
- గురు, రాహువులతో ఆ రాశులకు ఐశ్వర్య యోగాలు..!
- Vastu Tips: ఈ పక్షులు ఇంటికొస్తే మీ దశ తిరిగినట్టే.. ఈ మూగజీవాలు ఇచ్చే సంకేతాలివే..
- నేటి జాతకములు.11 ఏప్రిల్, 2025