వృద్ధ దంపతులు… నాకు నువ్వు.. నీకు నేను అనుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. అలాంటి పండుటాకులపై గుర్తుతెలియని వ్యక్తులు పంజా విసిరారు. అది కూడా మామూలుగా కాదూ.. నట్టింట్లో క్రూయల్‌గా మట్టుబెట్టారు. అలా వెళ్లి.. ఇలా వచ్చారు. ఈ గ్యాప్‌లో జరిగిన ఘోరమే ఖాకీలకు పెద్ద టాస్క్‌గా మారింది.
హైదరాబాద్ రాజేంద్రనగర్.. జన చైతన్య ఫేజ్ నెంబర్ 2.. అబ్రిజ్ రెసిడెన్సీ అపార్ట్‌మెంట్.. ఈ అపార్ట్‌మెంట్‌లో వృద్ధ దంపతులు దారుణహత్యకు గురయ్యారు. చంపిందెవరు? మారువేషంలో రావడం వెనుక మతలబేంటి? అన్నవి ఇప్పుడు టాప్ క్వశ్చన్స్.
అమెరికాలో సెటిలైన బిడ్డలు
రిజ్వానా – షేక్ అబ్దుల్లా దంపతులు 5వ ఫ్లోర్‌లో ఉంటున్నారు. ఎస్‌బీఐ బ్యాంక్ ఉద్యోగులుగా రిటైర్డ్ అయ్యారు. వీళ్లకు నలుగురు సంతానం. అందరూ అమెరికాలోనే సెటిలయ్యారు. అనారోగ్యం కారణంగా దంపతులు తరచుగా ఫిజియోథెరపీ చేయించుకుంటున్నారు. మధ్యాహ్నం సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు.. అపార్ట్‌మెంట్‌కి వచ్చారు. ఫిజియోథెరపీ చేసేందుకు వచ్చామని చెప్పడంతో వాచ్‌మెన్ అభ్యంతరం చెప్పలేదు. లోపలికి వెళ్లారు.. బయటకు వచ్చారు. అంతలోనే వృద్ధ దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. వాచ్‌మెన్ ఇచ్చిన సమాచారంతో క్లూస్ టీమ్‌తో స్పాట్‌కి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించారు.
గోల్డ్ కోసమా? నగల కోసమా?
ఒకరు బురఖా ధరిస్తే మరొకరు ముఖానికి మాస్క్ వేసుకున్నారు. ఎవరూ గుర్తుపట్టకుండా జాగ్రత్తలు తీసుకున్నట్టు క్లియర్‌గా తెలుస్తుంది. అయితే వాళ్లు ఎందుకొచ్చారు? గోల్డ్ కోసమా? నగల కోసమా? వాటికోసమే అయితే.. వృద్ధ దంపతులు ప్రతిఘటించే ఛాన్సే ఉండదు. మరయితే ఎందుకు చంపేశారు? అన్నది మెయిన్ డౌట్. పోలీసులు మాత్రం డాక్యుమెంట్ల కోసం వచ్చారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగానే దర్యాప్తు చేపట్టామని.. తొందర్లోనే హంతకుల్ని అరెస్ట్ చేస్తామన్నారు.
రిజ్వానా కొడుకులిచ్చే సమాచారం ఆధారంగా దర్యాప్తు
దొంగలైతే నగల కోసమో నగదు కోసమో అయి ఉంటుంది. కానీ ఇక్కడ అవేవీ పోలేదు. కాకపోతే డాక్యుమెంట్ల కోసం ఇల్లు జల్లెడ పట్టినట్టుంది. సీన్ ఆఫ్ అఫెన్స్ చూస్తే.. గుర్తుతెలియని వ్యక్తులు కేవలం కీలకమైన పత్రాల కోసం వచ్చినట్టు తెలుస్తోంది. ముందు రిజ్వానా కొడుకుల్ని కాంటాక్ట్ చేయాలని భావిస్తున్నారు పోలీసులు. వాళ్లు ఇచ్చే సమాచారం ఆధారంగా మరింత లోతుగా దర్యాప్తు చేసే ఆలోచనలో ఉన్నారు. శివారు ప్రాంతంలో హత్యలు జరగడం సాధారణమే. కానీ మిట్ట మధ్యాహ్నం డబుల్ మర్డర్ జరగడంతో అపార్ట్‌మెంట్ వాసుల్లో ఆందోళన మొదలైంది
Also read
- Andhra: ఇద్దరు వ్యక్తులు, 8 చికెన్ బిర్యానీ ప్యాకెట్లు.. హాస్టల్ గోడ దూకి.. సీన్ కట్ చేస్తే.!
- Andhra: ఏడాదిన్నరగా తగ్గని కాలినొప్పి.. స్కానింగ్ చేయగా తుని హాస్పిటల్లో అసలు విషయం తేలింది
- పెళ్లిలో వధువు రూమ్ దగ్గర తచ్చాడుతూ కనిపించిన ఇద్దరు వ్యక్తులు.. కట్ చేస్తే.. ఒక్కసారిగా అలజడి..
- Andhra: నెల్లూరునే గజగజ వణికించేసిందిగా..! పద్దతికి చీర కట్టినట్టుగా ఉందనుకుంటే పప్పులో కాలేస్తారు
- గుడిలో ప్రసాదంగా పిజ్జా, పానీపూరి.. కారణం తెలిస్తే అవాక్కే.. ఎక్కడ ఉన్నాయో తెలుసా..?





