హైదరాబాద్‌లో గంజాయి స్మగ్లింగ్‌పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. గంజాయి ఎక్కడ పట్టుబడ్డా.. దాని మూలాలు ధూల్‌పేట్‌కు కనెక్ట్ అవుతుండడంతో అక్కడ స్పెషల్ ఫోకస్ పెట్టారు. గతంలో గుడుంబాకు అడ్డాగా ఉన్న ధూల్‌పేట్‌ను సమూలంగా ప్రక్షాళించిన పోలీసులు.. ఇప్పుడు.. గంజాయి నిర్మూలన కోసం.. ఆపరేషన్ ధూల్‌పేట్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రెగ్యులర్ తనిఖీలతో స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపుతున్నారు.. గంజాయి స్మగ్లింగ్, మూలాలపై పోలీసులు ప్రత్యేక ఫోకస్ పెట్టడంతో స్మగ్లర్లు మరో అవతారం ఎత్తారు.. ఎవ్వరికీ అనుమానం రాకుండా.. మరో పుసుపు ప్యాకెట్ల మాటున గంజాయ్ ను తరలించడం ప్రారంభించారు.. పుష్ప సినిమా మాదిరిగా స్మగ్లర్లు వేసిన స్కెచ్ లకు పోలీసులు దిమ్మతిరిగే చెక్ పెట్టారు.. ధూల్‌పేట్ లో పసుపు ప్యాకెట్ల మాటున సాగుతున్న గంజాయ్ గుట్టును రట్టు చేశారు..
పసుపు ప్యాకెట్లలో గంజాయి తరలిస్తున్న ముఠాను ఎక్సైజ్ ఎన్ఫోర్స్‌మెంట్ పోలీసులు సోమవారం పట్టుకున్నారు.. దూల్పేట్ కి చెందిన నేహా భాయ్ అనే మహిళ పసుపు ప్యాకెట్లలో గంజాయి పెట్టి అమ్మకాలు చేస్తుండగా.. పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ సందర్భంగా 10 గంజాయి పాకెట్లను స్వాధీనం చేసుకొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
వీడియో చూడండి..
గత కొన్నిరోజులుగా.. తెలంగాణ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు, పోలీసులు గంజాయి మాటెత్తితే తాట తీసేలా వ్యవహారిస్తున్నారు. ప్రధానంగా.. హైదరాబాద్‌లో గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నారు. గంజాయి జాడ తెలిస్తేచాలు.. క్షణాల్లో వాలిపోతున్నారు. చిన్న క్లూ దొరికిందా.. ఇక.. అంతే సంగతులు.. వల పన్ని మరి నిందితుల గంజాయి గుట్టురట్టు చేస్తున్నారు. అయితే.. హైదరాబాద్ నగరంలో ఎక్కడ గంజాయి దొరికినా.. దాని మూలాలు దూల్‌పేట్‌కు కనెక్ట్ అవుతుండడంతో పోలీసులు ఆ దిశగా వేట మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే.. దూల్‌పేట్‌లో గంజాయి వ్యవహారం తీగ లాగితే.. డొంక బయటపడుతుండటంతో సీరియస్‌గా తనిఖీలు చేస్తున్నారు
Also read
- ఏంతకు తెగించావురా… బంగారం కావాలంటే కొనుక్కోవాలి… లాక్కోకూడదు.
- ప్రియుడి భార్యపై HIV ఇంజెక్షన్‌తో దాడి.. ఆ తర్వాత సీన్ ఇదే!
- అర్ధరాత్రి వేళ ట్రావెల్స్ బస్సు బీభత్సం.. డ్రైవర్ పొట్టలోకి దిగిన వెదురు బొంగులు!
- గుంటూరులో వ్యభిచార గృహంపై పోలీసుల దాడి.. ఆరుగురి అరెస్ట్*
- నిమ్మకాయలు.. నల్లటి ముగ్గు.. పసుపు కుంకుమలు.. ఆ ఇళ్ల ముందు రాత్రికి రాత్రే ఏం జరిగింది….





