SGSTV NEWS online
CrimeTelangana

Hyderabad: బ్యాటరీ ఛార్జ్‌ చేస్తుండగా ఎలక్ట్రిక్‌ బైక్‌లో మంటలు.. మెడికల్‌ షాపు దగ్ధం..!




మెడికల్ షాప్‌కు మంటలు వ్యాపించాయి. వాహనం బ్యాటరీ ఛార్జ్ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. వాహనం పూర్తిగా దగ్ధం కాగా.. మెడికల్ షాపు ముందు భాగం పాక్షికంగా దగ్ధమైంది. దీంతో ఆ రోడ్డుపై ట్రాఫిక్‌ స్తంభించింది. ఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.


హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సూరారం ఎక్స్ రోడ్డు వద్ద ఉన్న ఆదిత్య మెడికల్ షాపు ముందు పార్క్ చేసిన ఎలక్ట్రికల్ బైక్‌లో మంటలు చెలరేగాయి. మెడికల్ షాప్‌కు మంటలు వ్యాపించాయి. వాహనం బ్యాటరీ ఛార్జ్ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. వాహనం పూర్తిగా దగ్ధం కాగా.. మెడికల్ షాపు ముందు భాగం పాక్షికంగా దగ్ధమైంది. దీంతో ఆ రోడ్డుపై ట్రాఫిక్‌ స్తంభించింది. ఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.

ఒక్కసారిగా బైకులో మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల ఉన్న ప్రజలు, వాహనదారులు, దుకాణదారులు భయబ్రాంతులకు గురయ్యారు. మెడికల్ షాపు ముందే బైకు దగ్దమవ్వటంతో షాపు ముందు భాగం పాక్షికంగా దగ్దమయ్యింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.

Also read

Related posts