ఈజీ మనీకి అలవాటు పడిన కొందరు కేటుగాళ్లు జనాలను ఎలా దోచుకోవాలని కొత్తకొత్త మార్గాలను ఆన్వేషిస్తున్నారు. జనాలు కూడా వారు చెప్పిన మాటలు నమ్మి నిండా మునుగుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లో వెలుగు చూసింది. సినిమా తరహాలో మాయమాటలు చెప్పి ఓ వైద్యురాలి నుంచి ఏకంగా రూ.1.50కోట్లు కొట్టేశారు కేటుగాళ్లు.
మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇంద్ర సినిమా మీ అందరూ చూసే ఉంటారు. అందులో కాశీకి వచ్చిన ఒక ఫ్యామిలీని బ్రహ్మానందం అతనితో పాటు మరో ఇద్దరు కలిసి మీ నగలను గంగలో వేస్తే డబుల్ అవుతాయని చెప్పి ఎలాగైతే మోసం చేస్తారో అచ్చం అలానే హైదరాబాద్‌కు చెందిన ఒక వైద్యులు రాలిని మోసం చేసి ఏకంగా రూ.1.50 కోట్లు కాజేశారు కేటుగాళ్లు. బాధితురాలి ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన ప్రియాంక అనే వైద్యురాలికి విశాఖపట్నం అరకులోయకు చెందిన పెందుర్తి శ్రీనివాస్, వనుము శ్రీనివాస్, కొర్రా బంగార్రాజు అనే వ్యక్తులు పరియచమయ్యారు. తమ దగ్గర రూ.30 కోట్లు విలువ చేసే మహిళగల చెంబు ఉందని.. ఆ చెంబులో డబ్బులు వేస్తే రెట్టింపు అవుతాయంటూ ప్రియాంకకు మాయ మాటలు చెప్పారు. అది నిజమేనని నమ్మిన ప్రియాంక వారికి పలు దఫాలుగా రూ.1.50 కోట్లు సమర్పించుకుంది.
ఆరు నెలల గడుస్తున్నా వారి నుండి ఎటువంటి స్పందన లేకపోవడంతో, తాను మోసపోయానని గ్రహించి ప్రియాంక స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని నుంచి రూ.2,42,400 నగదు, కారు స్వాధీనం చేసుకున్నారు
Also read
- అంతులేని సంపద, తిరుగులేని అదృష్టం.. ఇది మెడలో ధరిస్తే ఎన్ని ప్రయోజనాలో..
- Watch: నాగులచవితి నాడు అద్భుతం..! శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి..
- లేడీ డాక్టర్ ఆత్మహత్య కేసు కొత్త మలుపు.. టెక్కీ అరెస్ట్‌తో వెలుగులోకి సంచలనాలు!
- Andhra: తనను పట్టించుకోని కూతురికి ఊహించిన ఝలక్ ఇచ్చిన వృద్ధురాలు..
- హైదరాబాద్ నడిబొడ్డున కాల్పుల కలకలం





